- Telugu News Photo Gallery Cinema photos Can You Guess the Actress In This Photo She Is Tollywoo Actress Pragathi Teenage Photo telugu cinema news
Tollywood: అందం ఆమె DNAలో ఉంది.. తెలుగునాట క్రేజున్న ఆర్టిస్ట్.. గుర్తుపట్టారా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలోనై సహజ నటనతో మెప్పి్స్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎంతో మంది హీరోలకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి అలరించింది. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
Updated on: Jun 13, 2024 | 5:35 PM

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలోనై సహజ నటనతో మెప్పి్స్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎంతో మంది హీరోలకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి అలరించింది. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఆ నటి మరెవరో కాదు.. తెలుగు ప్రేక్షకులు సుపరిచితమైన యాక్టర్ ప్రగతి. తెలుగు సినిమాల్లో అమ్మ, అత్త, అక్క, వదిన ఇలా అనేక రకాల పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళ నటుడు భాగ్యరాజ్ ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

వీట్ల విశేషగణతో కోలీవుడ్ ఏంట్రీ ఇఛ్చిన ప్రగతి... అతి తక్కువ సమయంలోనే ఏడు సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత మలయాళంలో ఓ సినిమా చేసింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తుంది ప్రగతి.

ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ప్రగతి.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఇటీవల పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెడల్ కూడా అందుకుంది.

తాజాగా నటి ప్రగతికి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో పైన మీరు చూసిన ఫోటో కూడా ఒకటి. జిమ్ వర్కవుట్స్, పవర్ లిఫ్టింగ్ కాకుండా బైక్ రైడ్స్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.