Sandeep Koritala : తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖహీరో..

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  నిర్మాత సందీప్ కొరిటాల గుండెపోటుతో  కన్నుమూశారు. సందీప్ కొరిటాల మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం

  • Rajeev Rayala
  • Publish Date - 7:37 am, Mon, 1 March 21
Sandeep Koritala : తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖహీరో..

Sandeep Koritala Death: తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  నిర్మాత సందీప్ కొరిటాల గుండెపోటుతో  కన్నుమూశారు. సందీప్ కొరిటాల మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. సందీప్ కొరటాల మరణ వార్త హీరో నారా రోహిత్ ట్విట్టర్ ద్వారా తెలిసాయజేసారు. ఈ రెండు సినిమాల సమయంలో సందీప్ తో తమకు ఏర్పడిన అనుబంధాన్ని తలుచుకుంటూ నారా రోహిత్ ఆవేదనకు గురయ్యారు.

సందీప్ కొరిటాల నారా రోహిత్ నటించిన రౌడీఫెలో సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే నిఖిల్ నటించిన స్వామి రారా సినిమాకు కూడా సహనిర్మాతగా వ్యవహరించారు సందీప్ కొరిటాల. సందీప్ మృతిపట్ల స్వామిరారా సినిమా దర్శకుడు సుధీర్ వర్మ సంతాపం తెలిపారు.

నారా రోహిత్ ట్వీట్ చేస్తూ.”నా రౌడీ ఫెలో సినిమా సహనిర్మాత నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి” అని ట్వీట్ చేశారు.

స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్ చేస్తూ ..”నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ తెరకెక్కించడంలో మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బ్రదర్. నిన్ను మేం చాలా మిస్ అవుతున్నాం” అని భావోద్వేగానికి గురయ్యారు సుధీర్ వర్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ‘క్రాక్ జయమ్మ’.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..