“ఆ పాత్ర నా జీవితంలో మ‌ర్చిపోలేనిది…”

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'సూపర్‌ 30'. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ స్థాపించిన 'సూపర్‌30' అనే ఐఐటీ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్ట‌ర్ దర్శకుడు వికాస్‌ బెహెల్‌ తెరకెక్కించాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 10:26 pm, Sun, 12 July 20
"ఆ పాత్ర నా జీవితంలో మ‌ర్చిపోలేనిది..."

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘సూపర్‌ 30’. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ స్థాపించిన ‘సూపర్‌30’ అనే ఐఐటీ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్ట‌ర్ దర్శకుడు వికాస్‌ బెహెల్‌ తెరకెక్కించాడు. తాజాగా జులై 12తో ఈ చిత్రం రిలీజై ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హృతిక్​ దీనిపై రెస్పాండ్ అయ్యాడు. ఆనంద్​కుమార్ పాత్ర పోషించడం తన కెరీర్​లోనే చాలా స్పెషల్ గా భావిస్తాన‌ని తెలిపాడు. ‘సూపర్​ 30’ విజయం సాధించినప్పుడు పొందిన ఫీలింగ్..గ‌తంలో‌ ఏ చిత్ర విజయ‌మ‌ప్పుడు పొంద‌లేద‌ని తెలిపాడు. కెమెరా ముందు ఆనంద్​ కుమార్​లా నటించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. అప్పుడే ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుందనే విషయాన్ని నమ్మలేకపోతున్నాన‌ని తెలిపాడు.

హృతిక్​ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఈ మూవీలో కనిపిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతడు విద్యా సంస్థలో ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాడు. ఏటా 30 మంది ఉత్తమ విద్యార్థులకు ఫ్రీగా ఐఐటీలో శిక్ష‌ణ‌‌ ఇస్తుంటాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న సంఘటనల స‌మాహామే ఈ సినిమా.