Rashmika Mandanna: క్రేజీ ఫ్యాన్.. రష్మిక ఇల్లు వెతుక్కుంటూ 900 కిలోమీటర్ల ప్రయాణం.. చివరకు
స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు అభిమానులు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. తన ఫ్యాన్స్‌పై అంతే ప్రేమ కురిపిస్తుంది...
స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు అభిమానులు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. తన ఫ్యాన్స్‌పై అంతే ప్రేమ కురిపిస్తుంది ఈ క్యూట్ గర్ల్. అయితే అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్ ఒకరు అలాంటి పనే చేశాడు. ఎప్పుడూ తెరమీదేనా.. ఓ సారి రియల్‌గా చూద్దాం అనుకున్నాడో ఏమో.. ఆమెను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని కొడగు జిల్లాకు వివిధ మార్గాల్లో ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు. కానీ, చివరికి పోలీసులు అతడి ఆశలపై నీళ్ల చల్లారు. తన అభిమాన హీరోయిన్‌ను కలవకుండానే వెనక్కు తిరిగి పంపించేశారు.
అసలు ఏం జరిగిదంటే?
తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి.. తన అభిమాన హీరోయిన్ రష్మికను డైరెక్ట్‌గా చూడాలని డిసైడయ్యాడు. గూగుల్ ద్వారా ఆమె స్వస్థలం ఎక్కడో తెలుసుకున్నాడు. అనేక వ్యయప్రసాలకోర్చి కర్ణాటకలోని కొడగు జిల్లాకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకునేందుకు తెలంగాణ నుంచి ఫస్ట్ మైసూరు వచ్చే రైలు ఎక్కాడు. ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ… కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా ఉంటంతో… స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హీరోయిన్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిందని సదరు వ్యక్తిని వెనక్కిపంపారు.
Also Read: అంతుబట్టని ‘ఆచార్య’ మూమెంట్స్.. రిలీజ్ డేట్‌పై మెగాఫ్యాన్స్‌ని వెంటాడుతున్న సందేహాలు !