Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koo App: భారతీయ యాప్ ‘కూ’ లో చేరిన అనుష్క..ఇక నుంచి కూ లోనే అన్ని విషయాలను షేర్ చేస్తానన్న దేవసేన

Koo App: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా పలు అంశాలపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం మే 26 నుంచి తప్పనిసరి చేసిన..

Koo App: భారతీయ యాప్ 'కూ' లో చేరిన అనుష్క..ఇక నుంచి కూ లోనే అన్ని విషయాలను షేర్ చేస్తానన్న దేవసేన
Anushka Shetti
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2021 | 8:57 PM

Koo App: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా పలు అంశాలపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం మే 26 నుంచి తప్పనిసరి చేసిన కొత్త ఐటీ నిబంధనలను (New IT Rules) పాటించని కారణంగా ట్విట్టర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ట్విట్టర్ భారత చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా కూ ఎదగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ నేపధ్యంలో స్టార్ నటీనటులు స్వదేశీ టెక్నాలజీ సంస్థ ‘కూ’ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అనుష్క శెట్టి కూడా కూలో చేరారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా తాను ‘కూ’ లో చేరినట్లు అనుష్క శెట్టి అభిమానులకు సమాచారం ఇచ్చారు.

ఈ వార్తలను తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అనుష్క ప్రకటించింది. అందరూ సురక్షితంగా ఉన్నారని తాను నమ్ముతున్నట్లు అనుష్క తెలిపింది. అంతేకాదు తన అధికారిక ఖాతాను అనుసరించమని ఇక నుంచి తనకు సంబంధించిన అన్ని విశేషాలను కూ ద్వారా అభిమానులతో పంచుకుంటానని అనుష్క ప్రకటించింది. అనుష్క కూ లో జాయిన్ అవ్వడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనుష్క పేజీని 10 వేలకు మందికి పైగా ఫాలో అవుతున్నారు. అయితే అనుష్క ఇంకా ఎవరికీ ఫాలో కావడం లేదు. అయితే వివాదాస్పద కామెంట్ చేసినందుకు ట్విట్టర్ కంగనా రనౌత్ అకౌంట్ ను శాశ్వతంగా తొలగించింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ కూ లో జాయిన్ అయ్యారు.. తాజాగా అనుష్క కూడా కూ అకౌంట్ తీసుకోవడంతో కూ కు మరింతమంది రానున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:  భారతీయ శిల్పకళా సంపదకు గుర్తు ఈ గుహాలయాలు.. 20 అడుగుల ఏకశిల అనంతపద్మనాభ విగ్రహం ఇక్కడ స్పెషల్