Pooja Hegde: పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న బుట్టబొమ్మ.. స్టార్ హీరోలతోపాటు అవి కూడా..
సినిమా ఓకే చేయడానికి స్టార్ కాంబినేషన్ మాత్రమే మెయిన్ క్రైటీరియా కాదు.. ఇంకా చాలా ఉంటాయ్ అంటున్నారు సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మ.

Pooja Hegde: సినిమా ఓకే చేయడానికి స్టార్ కాంబినేషన్ మాత్రమే మెయిన్ క్రైటీరియా కాదు.. ఇంకా చాలా ఉంటాయ్ అంటున్నారు సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మ. ఇంతకీ మన అరవింద సినిమా సెలక్షన్ విషయంలో ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి..? ఓ పక్క పాన్ ఇండియా స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే.. మీడియం రేంజ్ హీరోలకు డేట్స్ ఇవ్వడం వెనుక అసలు రీజనేంటి అని ఆలోచిస్తున్న బుట్టబొమ్మ ఫ్యాన్స్. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో పూజా హెగ్డే నేమ్ కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు బుట్టబొమ్మ. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అంటే నేషనల్ లెవల్‌లో కనిపిస్తున్న ఫస్ట్ ఛాయిస్ పూజానే. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మీడియం రేంజ్ హీరోలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పూజ.
తన ఫస్ట్ తెలుగు హీరో నాగచైతన్యతో రీసెంట్‌గా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారీ లైలా. అయితే ప్రజెంట్ పూజా ఉన్న ఫాం చూస్తే.. చైతూ మూవీకి ఓకే చెప్పటం హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు అన్ని లాంగ్వేజెస్‌లోనూ సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న బ్యూటీ ఇంత టైట్ షెడ్యూల్‌లో మీడియం రేంజ్ సినిమా చేయటం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.ఈ క్వశ్చన్స్‌కు ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు అరవింద. సినిమాకు యస్ చెప్పడానికి ప్రతీసారి స్టార్ కాంబినేషనే మెయిన్ క్రైటీరియా కాదు. సమ్ టైమ్స్.. కథ, డైరెక్టర్ లాంటి విషయాలు కూడా సినిమాకు ఎస్ చెప్పడానికి రీజన్ అన్నారు. దీంతో ముందు ముందు కూడా కంటెంట్‌లో దమ్ముంటే పూజా చిన్న సినిమాలు కూడా చేస్తారన్న మాట. మరి ఈ స్టేట్మెంట్ తరువాత జిగేలు రాణి కోసం మన దర్శక నిర్మాతలు అలాంటి కంటెంట్ రెడీ చేస్తారేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :