ఇండస్ట్రీలో ఆయనే నా గురువు.. ఆ స్టార్ హీరోని ఆకాశానికెత్తేసిన సమంత.. పొంగిపోతున్న ఫ్యాన్స్

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమా హీరోయిన్ గా మారింది సమంత.ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, తేరి, రంగస్థలం, ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇండస్ట్రీలో ఆయనే నా గురువు.. ఆ స్టార్ హీరోని ఆకాశానికెత్తేసిన సమంత.. పొంగిపోతున్న ఫ్యాన్స్
Samantha

Updated on: Aug 11, 2025 | 12:21 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్‌గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. సమంత, నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది. ఇటీవలే నిర్మతగా మారి సినిమా చేసింది. శుభం అనే సినిమాతో నిర్మాతగా మారింది సామ్. అలాగే ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తుంది.

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఇదిలా ఉంటే సమంత గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో తనకు ఓ స్టార్ హీరో గురువు అని తెలిపింది సామ్. టాలీవుడ్ లో సమంత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ సినిమా చేసింది సమంత.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

పవన్ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది సినిమా చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా సామ్ నటించి మెప్పించింది. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పవన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని సమంత తెలిపింది. అలాగే షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో సమంతను పవన్ ఆశీర్వదిస్తూ కనిపించారు. దీని గురించి సమంత మాట్లాడుతూ.. పవన్ నా గురువుగారు అని చెప్పింది. స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా తీసిన ఫోటో అది అని.. పవన్ కళ్యాణ్ నటుడు కాకపోయి ఉంటే నాకు గురువుగా ఉండమని కోరేదాన్ని అంటూ సమంత తెలిపింది. అలాగే ఆయన ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిట్టే వారని సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ అభిమానులు సమంత కామెంట్స్ ను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

 

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి