AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravanthi Ravi Kishore: స్రవంతి రవికిశోర్ సినిమాకు అరుదైన గౌరవం.. స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న’కిడ’

ఇండియన్ పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Sravanthi Ravi Kishore: స్రవంతి రవికిశోర్ సినిమాకు అరుదైన గౌరవం.. స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న'కిడ'
Kida
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2022 | 8:14 PM

Share

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”నేను చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తానొక కథ విన్నానని, అద్భుతంగా ఉందని చెప్పారు. కథ ఏంటి? అని అడిగా. ఐదు నిమిషాల పాటు కథ చెప్పారు. వినగానే కనెక్ట్ అయ్యాను. సరేనని స్క్రిప్ట్, డైరెక్టర్ నేరేషన్ వాయిస్ పంపించామని అడిగా. కథ మొత్తం విన్నాను. బావుంటుందని వెంటనే ఓకే చెప్పా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. మా స్రవంతి సంస్థలో ఇది తొలి తమిళ సినిమా. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్ తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశా. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని అన్నారు ‌.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి దాదాపుగా అందరూ కొత్తవాళ్ళు పని చేశారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.పూరాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం థీసన్ అందించగా సినిమాటోగ్రఫీ ఎం. జయప్రకాశ్ అందించారు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..