SS Rajamouli: అదిరిందయ్యా జక్కన్న..! స్టెప్పులతో తిరగదీసిన రాజమౌళి.. ఇది మాములు రచ్చ కాదుగా.!
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీస్ కు దారి చూపించిన రాజమౌళి.. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేశారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక పై నిలబెట్టారు రాజమౌళి.
దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీస్ కు దారి చూపించిన రాజమౌళి.. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేశారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక పై నిలబెట్టారు రాజమౌళి. అయితే రాజమౌళిలో దర్శకుడు మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా ఉన్నారు. మొన్నామధ్య ఆయన ఓ ఫ్యామిలీ ఈవెంట్ లో భార్యతో కలిసి స్టెప్పులేశారు.
రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళితో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. తాజాగా రాజమౌళి డాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజమౌళి తన భార్యతో కలిసి డాన్స్ రిహార్సిల్స్ చేస్తూ కనిపించారు. అందమైన ప్రేమ రాణి చెయ్యితగిలితే అనే సాంగ్ కు జక్కన్న స్టెప్పులేశారు.
రాజమౌళి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.