AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gali Sampath Trailer: తండ్రి కోసం ఓ తనయుడు పడే తపనే ‘గాలి సంపత్‌’.. ఆసక్తికరంగా ట్రైలర్‌..

అనిల్‌ రావి పూడి మరోసారి ఓ సినిమాకు స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. అదే 'గాలి సంపత్‌' సినిమా. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు...

Gali Sampath Trailer: తండ్రి కోసం ఓ తనయుడు పడే తపనే 'గాలి సంపత్‌'.. ఆసక్తికరంగా ట్రైలర్‌..
Narender Vaitla
|

Updated on: Feb 27, 2021 | 12:50 PM

Share

Gali Sampath Trailer Out: ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఓ వైపు దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు రచయితగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘ఆగడు’, ‘పండగ చేస్కో’ వంటి చిత్రాలకు రైటర్‌గా వ్యవహరించాడు అనిల్‌. ఇదిలా ఉంటే తాజాగా అనిల్‌ రావి పూడి మరోసారి ఓ సినిమాకు స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. అదే ‘గాలి సంపత్‌’ సినిమా. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా పంచడం విశేషం. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికతో సరి చేస్తారు. అందేంటో.. కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోలు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మా నాన్నను కాస్త ఓపికగా, ప్రేమగా అడగాల్సింది సార్‌’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుంది. రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడే సమయంలో మాటల కంటే గాలే ఎక్కువగా వస్తుంది కాబట్టి అతణ్ని గాలి సంపత్‌ అని పిలుస్తుంటారు. ఇక రాజేంద్రప్రసాద్‌కు హీరో అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ దానికి అతను కొడుకు (శ్రీ విష్ణు) అడ్డు చెబుతుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఎలాంటి వివాదానికి దారి తీసింది. చివరికి రాజేంద్రప్రసాద్‌కు ఏమైంది అన్న ఆసక్తితో ట్రైలర్‌ ముగుస్తుంది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసిందని చెప్పాలి. ఇక ఎస్‌.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: వైరల్ అవుతున్న చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ లొకేషన్ స్టిల్స్.. మారేడుమిల్లి లో మెగా ఫాన్స్ అభిమానం

Rakhi Sawant : రాఖీసావంత్‌‌‌‌‌కు అండగా సల్మాన్ ఖాన్.. దేవుడిచ్చిన సోదరుడు అంటూ ఎమోషనల్ అయిన నటి..