AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కలలో వచ్చే రాజకుమారుడు ఆ స్టార్ హీరోనేనట..

ప్రస్తుతం శ్రీలీలబ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. శ్రీలీల నటన, డ్యాన్స్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగులో శ్రీలీల పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి శ్రీలీలని ఆహ్వానిస్తున్నారు. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా తన ఫెవెరెట్ హీరో ఎవరో తెలిపింది.

Sreeleela: లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కలలో వచ్చే రాజకుమారుడు ఆ స్టార్ హీరోనేనట..
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2023 | 8:37 AM

Share

కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీలబ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. శ్రీలీల నటన, డ్యాన్స్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగులో శ్రీలీల పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి శ్రీలీలని ఆహ్వానిస్తున్నారు. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా తన ఫెవెరెట్ హీరో ఎవరో తెలిపింది. రీసెంట్ గా శ్రీలీల మ్యాడ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా హాజరైంది.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు శ్రీలీలతోపాటు సిద్దూజొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన అభిమాన హీరో దుల్కర్ సల్మాన్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ..  సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మిమ్మల్ని అడిగాను అని చెప్పమంది అని తెలిపింది. “నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు.. గుర్రం మీద వస్తున్న యువరాజుని ఊహించుకున్నాను, మీ ‘హీరేయ్’ పాట చూసినప్పుడు, మీరే నా రాకుమారుడు అని అనుకున్నాను అని శ్రీలీల తెలిపింది. దాంతో దుల్కర్ సల్మాన్ చిన్నగా నవ్వి, ధన్యవాదాలు చెప్పాడు.

శ్రీలీల నటించిన స్కంద సినిమా గతవారం విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ తో కలిసి ‘ఆదికేశవ్‌’ అనే సినిమాలో నటిస్తుంది. అదేవిధంగా శ్రీలీల పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్ తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే సినిమా.. నవీన్ పోలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా.. అక్కినేని నాగ చైతన్య తో కలిసి ఓ సినిమా చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..