Asha Bhosle: ఆహా.. ఎంత గొప్ప దృశ్యం..! ఆశా భోస్లే కాళ్లు కడిగిన స్టార్ సింగర్ సోనూ నిగమ్

|

Jun 28, 2024 | 6:57 PM

1943లో ప్రారంభమైన ఆశా భోస్లే  ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ  పాటు విజయవంతంగా సాగింది. బాలీవుడ్ లో దాదాపు ఆమె 1000పాటలు ఆలపించారు. ఆశా భోస్లే ఎన్నో అవార్డులు అందుకున్నారు. తన మధుర స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలు అలరించారు ఆశా భోస్లే. తాజాగా ఆశా భోస్లే పై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వరస్వామిని ఆశ అనే పుస్తకాన్ని నేడు విడుదల చేశారు.

Asha Bhosle: ఆహా.. ఎంత గొప్ప దృశ్యం..! ఆశా భోస్లే కాళ్లు కడిగిన స్టార్ సింగర్ సోనూ నిగమ్
Sonu Nigam
Follow us on

గాయని ఆశా భోస్లే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు ఆమె.. 1943లో ప్రారంభమైన ఆశా భోస్లే  ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ  పాటు విజయవంతంగా సాగింది. బాలీవుడ్ లో దాదాపు ఆమె 1000పాటలు ఆలపించారు. ఆశా భోస్లే ఎన్నో అవార్డులు అందుకున్నారు. తన మధుర స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలు అలరించారు ఆశా భోస్లే. తాజాగా ఆశాభోస్లే జర్నీ పై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘స్వరస్వామిని ఆశ’ అనే పుస్తకాన్ని నేడు విడుదల చేశారు. అయితే ఈ పుస్తకావిష్కరణ వేదిక పై ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ఆశాభోంస్లే పాదాలను పనీర్‌తో కడిగారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో పండిట్ హృద్యనాథ్ మంగేష్కర్, ఉషా మంగేష్కర్, అశోక్ సరాఫ్, సురేష్ వాడ్కర్, శ్రీధర్ ఫడ్కే, రవీంద్ర సాఠే, పద్మజా ఫెనాని, ఉత్తర కేల్కర్, సుదేశ్ భోంస్లే, వైశాలి సమంత్ మరియు జాకీ ష్రాఫ్, నానా పటేకర్, పూనమ్ ధిల్లో, పద్మిని కొల్హాపురే పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ కూడా పాల్గొన్నారు. కాగా సోనూ నిగమ్ ఆశాభోంస్లే పాదాలను కడగటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇది కూడా చదవండి : Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

సోనూ నిగమ్ మాట్లాడుతూ.. ‘ఈరోజు సోషల్ మీడియాలో పాటలు నేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే పూర్వ కాలంలో లతాజీ, ఆశాజీ మాత్రమే ఉండేవారు. ఆశా జీ నుంచి చాలా నేర్చుకున్నాం. అందుకు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమె నుంచి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. మన హిందూ మతం సనాతన ధర్మంలో గురువుకు భగవంతుని స్థానం, ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆశా మనకు దేవదూత. సనాతన ధర్మం తరపున మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నాను’ అని సోనూ నిగమ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.