Singer Sunitha: వ్యవసాయం బాట పట్టిన సింగర్ సునీత.. చక్కరకేళీ అంత తియ్యన మీ స్వరం అంటున్న ఫ్యాన్స్
Singer Sunitha: సింగర్ సునీత తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతోనే కాదు.. మాటలతో కూడా తనదైన ముద్ర వేశారు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా..
Singer Sunitha: సింగర్ సునీత తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతోనే కాదు.. మాటలతో కూడా తనదైన ముద్ర వేశారు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా.. జడ్జిగా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. గులాబీ సినిమాలోని ఈ వేళలో నువ్వు ఏ మాయ చేశావో అంటూ.. తెలుగు సంగీత ప్రియులను తన స్వరంతో మాయలో పడేశారు. అనంతపురం సినిమాలో అసలేం గుర్తుకురాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటూ పరవశంలో ముంచేశారు. ముఖ్యంగా రమణ గోగుల సంగీతం అందించిన సినిమాల్లో సునీత పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్న సునీత గత ఏడాది రామ్ రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఇష్టాలు. అభిప్రాయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సునీత ఒక అరటిగెల ను కట్ చేసిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. చక్కరకేళీ ఎంత తీయగా ఉంటుందో తెలుసా….మీ గొంతునుంది వెలువడే పాటంత. మీ ఆనందం ఇలాగే కలకాలం ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సునీతకు ప్రకృతి అంటే చాల ఇస్తామన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు కూల్ గా హ్యాపీగా కనిపించే సునీతను చాలా మంది అభిమానిస్తారు. రెండో భర్త రామ్ తో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సునీత.. ప్రస్తుతం అతని వ్యాపారంలో సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
పాటలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తర్వాత సునీతకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ , వ్యవసాయాన్ని సునీత చాలా శ్రధ్దగా చేస్తారు. సునీత వంకాయలు.. ఏదో ఆకుకూర కోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు ఇలా పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం.. ఫ్రెష్ కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టం అని సునీత చెప్పారు. ఈ వీడియోకి రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎప్పుడూ పాటలు పాడుతూ కనిపించే సునీత ఒక్కసారిగా వ్యవసాయం వైపు వెళ్లడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రమేష్ బాబు మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం.. పుత్ర శోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని సూపర్ స్టార్ కృష్ణకు …