సినీ ఇండస్ట్రీలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ తారలను కోవిడ్ మహామ్మారి ఏమాత్రం వదలడం లేదు. ఇప్పటికే పలువుర్ స్టార్స్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో లతా మంగేష్కర్ బాధపడుతున్నారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
లతా మంగేష్కర్ గారికి స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి అంటూ ఆమె మేనకోడలు రచనా ట్వీట్ చేశారు. గతంలో 2019 నవంబర్ లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమెకు ఐరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లతా మంగేష్కర్ చెల్లెలు ఉష తెలిపింది. 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు . ఇండియన్ నైటింగల్‌గా పేరు సంపాదించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలను ఆలపించారు. మరోవైపు నటి రేణు దేశాయ్, అకీరానందన్ సైతం కోవిడ్ బారిన పడ్డారు. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
(file photo) pic.twitter.com/8DR3P0qbIR
— ANI (@ANI) January 11, 2022
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..