6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అలాగే ఎంతో మంది సింగర్స్ కూడా హీరో, హీరోయిన్స్ తో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న సింగర్ కూడా.. చిన్న వయసులోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత సింగర్‌గా మారింది.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
Singer

Updated on: Aug 19, 2025 | 7:45 PM

సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. కేవలం హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు .. కొంతమంది సింగర్స్ కూడా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పైన కనిపిస్తున్న సింగర్ కూడా అలా చిన్న వయసులోనే బాలనటిగా చేసి ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత సింగర్‌గా మారి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలాపించింది. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వందల సంఖ్యలో సాంగ్స్ ఆలపించి మెప్పించింది ఆమె. సింగర్ గా ఇండస్ట్రీలో ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ జీవితంలో మాత్రం ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కుంది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్‏లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. మెలోడి సాంగ్స్‏తోపాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ తన తోటి గాయని సింగర్ చిత్ర చెప్పిన ధైర్యంతో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.

తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

ఆరేళ్ల వయసులో కమల్ హాసన్ నటించిన ‘పున్నగై మన్నన్’ సినిమాలో బాలనటిగా కూడా కనిపించింది. ఐదేళ్ల వయసులోనే కల్పనా కర్ణాటక సంగీతం నేర్చుకుంది. మనోహరం అనే సినిమాలో సాంగ్ ద్వారా సింగర్ గా పరిచయమైంది. అంతే కాదు 33 ఏళ్ల వయసులో 1,500 ట్రాక్‌లు రికార్డ్ చేసి, 3000కు పైగా లైవ్ షోలలో పాల్గొని రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కల్పన తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. ” గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010లో విడాకులు అయ్యాయి. అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిని చదివించాలి. కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా ? అంటూ నాకు ధైర్యం చెప్పి.. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.