AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Janaki: జానకమ్మ ఏకైక కుమారుడు ప్రముఖ నటుడని తెలుసా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయారంటే?

సింగర్ జానకి (88) మరణంతో యావత్ సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. కాగా జానకమ్మకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల క్రితమే అతను కన్నుమూశాడు. ఇప్పుడు ఆమె కూడా..

Singer Janaki: జానకమ్మ ఏకైక కుమారుడు ప్రముఖ నటుడని తెలుసా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయారంటే?
Singer Janaki
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 3:04 PM

Share

తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి శనివారం (జులై 11) కన్నుమూశారు. దీంతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జానకమ్మకు నివాళి అర్పిస్తున్నారు. ఆమె పాడిన పాటలను మరోసారి స్మరించుకుంటున్నారు. జానకమ్మ గాన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. కానీ వ్యక్తిగత జీవితాన్ని ఆమె చాలా వరకు గోప్యంగానే ఉంచింది. అందుకే జానకమ్మ కుటుంబ సభ్యులు పెద్దగా బయట కనిపించేవారు కాదు. ఎస్. జానకి భర్త పేరు వి. రామ్ ప్రసాద్. వీరిది ప్రేమ వివాహమైనా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు. 1959లో జానకి- రామ్ ప్రసాద్ ల వివాహం జరిగింది. కాగా లెజెండరీ సింగర్ గా జానకికి ఇంత మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం భర్త రామ్ ప్రసాద్ అని చెప్పవచ్చు. సింగర్ గా జానకి బిజీగా ఉన్న రోజుల్లో కుటుంబ బాధ్యతలను మొత్తం రామ్ ప్రసాద్ బ్యాలెన్స్ చేశారట. అయితే 1997లో రామప్రసాద్ మరణించడం జానకి జీవితంలో పెద్ద విషాదంగా మిగిలిపోయింది.

జానకి- రామ్ ప్రసాద్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు మురళీ కృష్ణ. తండ్రి రామ ప్రసాద్ మరణానంతరం తల్లిని చూసుకునే బాధ్యతను పూర్తిగా మురళీకృష్ణే తీసుకున్నారు. అన్నట్లు జానకి కుమారుడు కూడా పలు సినిమాల్లో నటించారు. శ్రుతిలయలు సినిమాతో తెరంగేట్రం చేసిన మురళీ కృష్ణ. వినాయకుడు, మల్లెపువ్వు వంటి చిత్రాల్లో నటించారు. మలయాళం, కన్నడ భాషలపై మురళీకి మంచి పట్టు ఉంది. మలయాళంలో సురాజ్ వెంజరమూడు హీరోగా తెరకెక్కిన కూలింగ్ గ్లాస్ చిత్రానికి జానకమ్మ కుమారుడే కథను అందించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి
Singer Janaki Family

Singer Janaki Family

కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే మురళీ కృష్ణ హఠాన్మరణం చెందారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన జనవరి 22న గుండెపోటుతో కన్నుమూశారు. ఏకైక కుమారుడి మరణంతో జానకమ్మ బాగా కుంగిపోయారని తెలుస్తోంది. అందుకే ఐదు నెలల వ్యవధిలోన ఆమె కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

జానకమ్మను కడసారి చూసేందుకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us