Nayanthara: నయనతారపై బాడీ షేమింగ్ ట్రోల్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి..

కనెక్ట్ ప్రీమియర్ షోలో పాల్గోన్న అనంతరం.. అభిమానులతో నయన్ ముచ్చటిస్తోన్న వీడియోను ఓ ఆంగ్ల ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ షేర్ చేయగా.. పలువురు నెటిజన్స్ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.

Nayanthara: నయనతారపై బాడీ షేమింగ్ ట్రోల్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి..
Nayanthara

Updated on: Dec 24, 2022 | 7:00 PM

దాదాపు 10 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాను ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయన్ చురుగ్గా పాల్గొంది. అంతేకాకుండా.. ఇన్నేళ్లుగా తనపై వచ్చిన విమర్శలపై సానుకూలంగా స్పందించింది. అలాగే కనెక్ట్ సినిమా ప్రివ్యూ షోకు తన భర్త నయన్ విఘ్నేష్ తో కలిసి థియేటర్లలో సందడి చేసింది నయన్. హాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా అందంగా ముస్తాబై వచ్చిన ఆమెను చూసి సినీ ప్రియులు ముగ్దులయ్యారు. అక్కడున్న ప్రేక్షకులతో సరదాగా మాట్లాడింది లేడీ సూపర్ స్టార్. నయన్ న్యూస్మార్ట్ లుక్స్ పై కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆమె శరీరాకృతిపై దారుణంగా కామెంట్స్ చేశారు. అయితే నయన్ లుక్స్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినవారిపై సింగర్ చిన్మయి మండిపడ్డారు. ఒక మహిళ శరీరాకృతి గురించి చెత్త కామెంట్లు చేసే ఇలాంటి వ్యక్తులకు ఆడపిల్లలు ఉంటే ఏంటీ పరిస్థితి ? అంటూ ప్రశ్నించారు.

“ఇలాంటి పురుషులు ఇంట్లో ఉంటే మహిళలు వారి కన్న బిడ్డలకు కూడా చున్నీ వేసే తిప్పాలేమో.. ఎందుకంటే పురుషుడు అతడి ఫీలింగ్స్ ఆపుకోలేడు కదా.. తండ్రైనా, సోదరుడైనా ఇంట్లో ఆడపిల్లలను కూడా అలాంటి దుర్భద్దితోనే చూస్తాడేమో” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలందరూ తమ ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా ఉంచాలని.. వాళ్ల వల్ల ఎటువంటి సంరక్షణ ఉందని మండిపడింది. చిన్మయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కనెక్ట్ ప్రీమియర్ షోలో పాల్గోన్న అనంతరం.. అభిమానులతో నయన్ ముచ్చటిస్తోన్న వీడియోను ఓ ఆంగ్ల ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ షేర్ చేయగా.. పలువురు నెటిజన్స్ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించగా.. నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.