AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth- Aditi Rao Hydari: పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేమపక్షులు.. సిద్ధార్థ్, అదితి సంపాదన ఎంతో తెలుసా..

తాజాగా తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు సిద్ధార్థ్, అదితి. తమకు పెళ్లి కాలేదని.. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందంటూ రింగ్ ఫోటోస్ షేర్ చేశారు. అదితితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. "ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్" అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేశాడు. ఇక సిద్దార్థ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ "అతడు ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్" అంటూ అదితి పోస్ట్ చేసింది.

Siddharth- Aditi Rao Hydari: పెళ్లి విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేమపక్షులు.. సిద్ధార్థ్, అదితి సంపాదన ఎంతో తెలుసా..
Siddharth, Aditi Rao Hydari
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2024 | 9:57 AM

Share

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్నారంటూ గత మూడు రోజులుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని వనపర్తిలో శ్రీరంగనాయక ఆలయంలో వీరిద్దరి వివాహం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లుగా న్యూస్ వైరలయ్యింది. తమిళనాడు పురోహితులు వీరిద్దరి పెళ్లి జరిపించారని టాక్ నడిచింది. అయితే తాజాగా తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు సిద్ధార్థ్, అదితి. తమకు పెళ్లి కాలేదని.. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందంటూ రింగ్ ఫోటోస్ షేర్ చేశారు. అదితితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్” అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేశాడు. ఇక సిద్దార్థ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “అతడు ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్” అంటూ అదితి పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరలవుతుండగా.. సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్, అదితి ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరలవుతుండగా..వారిద్దరి పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కాగా.. గతంలో ఇద్దర లైఫ్.. భాగస్వామిల గురించి ఆరా తీస్తున్నారు. అలాగే అదితి, సిద్ధార్థ్ మూవీ రెమ్యునరేషన్.. వారి సంపాదన గురించి తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై ఓ లుక్కెయ్యండి మీరు.

సిద్ధార్థ్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు. 2003లో బాయ్స్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సిద్ధ్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అతడిని దగ్గరచేశాయి. సిద్ధార్థ్ నికర విలువ దాదాపు రూ. 70 కోట్లు. అతడి వద్ద రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి A4 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, చెన్నై, ముంబై ప్రాంతాల్లో సొంతంగా ఇళ్లు, ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం.

ఇక అదితి రావ్ హైదరీ వనపర్తి రాజవంశస్తురాలు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె నికర విలువ దాదాపు రూ. 60-62 కోట్లు. ఒక్క సినిమాకు దాదాపు ఒక కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందని. అలాగే బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ ద్వారా రు. 40 లక్షల వరకు సంపాదిస్తుంది. హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఆమె వద్ద ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ క్యూఎల్ఎస్, బిఎమ్డబ్ల్యూ ఎక్స్ 7 వంటి లగ్జరీ కార్ల ఉన్నాయి. వీరిద్దరి నికర విలువ కలిపి మొత్తం రూ. 130 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us