AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సర్పంచ్ పదవికి ఇంత డిమాండా.. వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సాధారణంగా ఎన్నికలంటే ప్రచార హోరు, నామినేషన్ల హడావుడి, వర్గ విభేదాలు, కోట్లాది రూపాయల ఖర్చు కనిపిస్తుంటుంది. కానీ, ఈసారి పల్లె పోరులో సీన్ రివర్స్ అయింది.. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాకముందే.. గ్రామాల్లో ఏకగ్రీవాల పర్వం ఊపందుకుంది. గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం జరుగుతున్న బహిరంగ వేలంపాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి ఏకంగా రూ.81 లక్షల ధర పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: సర్పంచ్ పదవికి ఇంత డిమాండా.. వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Sarpanch Post Auctioned For Rs 81 Lakh In Palnadu
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 15, 2026 | 3:12 PM

Share

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. తొలి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే గ్రామాల్లో ఏకగ్రీవాల పర్వం ఊపందుకుంది. ఎన్నికల ఖర్చులు, వర్గ విభేదాలకు తావులేకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా స్థానికులు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతుండగా.. కొన్నిచోట్ల సర్పంచ్ పదవులకు ఏకంగా బహిరంగ వేలంపాటలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం జరిగిన వేలంపాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. 5వేల లోపు జనాభా ఉన్న ఈ పంచాయతీకి తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. గ్రామంలో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేయాలని రెండు ప్రధాన పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. అయితే సర్పంచ్ పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధపడటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై గ్రామ పెద్దలు సమాలోచనలు జరిపారు.

వేలంపాటతో సర్పంచ్ ఎన్నిక

చివరికి వేలంపాట ద్వారా అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈ వేలంపాటలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొరటా గోపాలరావు రూ.77 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా ఆయనకంటే మిన్నగా యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. దీంతో ఆయన్నే ఏకగ్రీవ అభ్యర్థిగా బరిలోకి దించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. వేలం ముగిసిన వెంటనే గ్రామంలో యర్రా శ్రీనివాసరావు పేరిట ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.

ఏకగ్రీవాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ నజరానాలను ప్రకటించింది.

  • 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు: రూ. 15 లక్షలు
  • 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు: రూ. 25 లక్షలు
  • 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు: రూ. 50 లక్షలు

జొన్నలగడ్డ పంచాయతీ ఏకగ్రీవమైతే, అభ్యర్థి చెల్లించే రూ.81 లక్షలకు తోడు ప్రభుత్వం ఇచ్చే రూ.15 లక్షల ప్రోత్సాహక నిధి కూడా జమ అవుతుంది. ఈ నిధులన్నింటినీ గ్రామ అభివృద్ధికి వినియోగించవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Follow Us
సర్పంచ్ పదవికి ఇంత డిమాండా.. వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలిస్తే..
సర్పంచ్ పదవికి ఇంత డిమాండా.. వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలిస్తే..
తొలి వన్డేలోనే డకౌట్.. సచిన్, ధోనీ సరసన యశ్ ఠాకూర్
తొలి వన్డేలోనే డకౌట్.. సచిన్, ధోనీ సరసన యశ్ ఠాకూర్
సూర్యుడి రాశి మార్పుతో ఈ 4 రాశులకు భారీ ధన లాభాలు.. అంతా అదృష్టమే
సూర్యుడి రాశి మార్పుతో ఈ 4 రాశులకు భారీ ధన లాభాలు.. అంతా అదృష్టమే
డిసెంబర్ నాటికి బంగారం ధరల్లో భారీ పతనం.. ఊహించని లెక్కలు..
డిసెంబర్ నాటికి బంగారం ధరల్లో భారీ పతనం.. ఊహించని లెక్కలు..
మొక్కజొన్న సాగులో 70 క్వింటాళ్ల దిగుబడికి చైనా పద్ధతి!
మొక్కజొన్న సాగులో 70 క్వింటాళ్ల దిగుబడికి చైనా పద్ధతి!
గురుదేవ్ రవిశంకర్ సమక్షంలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
గురుదేవ్ రవిశంకర్ సమక్షంలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్
కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్
పార్ట్‌నర్ అంటూ మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల వెనకున్న..
పార్ట్‌నర్ అంటూ మాయాజాలం.. డెలివరీ బాయ్స్ జీవితాల వెనకున్న..
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
రూ. 99 కే చికెన్ బిర్యానీ అమ్మితే ఓనర్‌కు నిజంగా ఎంత మిగులుతుంది?
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్