Shruti Haasan: తండ్రి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శృతి హాసన్.. చూస్తే మతిపోతిపోవాల్సిందే..

అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్రుతిహాసన్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది.

Shruti Haasan: తండ్రి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శృతి హాసన్.. చూస్తే మతిపోతిపోవాల్సిందే..
Shruti Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2022 | 6:40 AM

అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్రుతిహాసన్(Shruti Haasan). మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, కోలివుడ్ తో పాటు వీలు దొరికినప్పుడల్లా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. కొంతకాలంగా శృతికి సరైన హిట్ పడలేదు. అదే సమయం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది శృతి. ఆ తర్వాత పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య కు జోడీగా గోపీచంద్ తెరకెక్కిస్తోన్న NBK 107లో నటిస్తోంది.

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ భామ. నిత్యం రకరకాల పోస్ట్ లతో అభిమానులను అలరిస్తోంది ఈ చిన్నది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో శృతి తన డాన్స్ తో ఆకట్టుకుంది. బోల్డ్ మేకప్ తో బ్లాక్ లేటెక్స్ జంప్ సూట్ శృతి తన డాన్స్ తో ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు ఏ పాటకు డాన్స్ చేసిందంటే.. తన తండ్రి కమల్ హాసన్ నటించిన సినిమాలోని రాజా కయ వచ్చే.. అంటూ సాగే  క్లాసిక్ ట్యూన్ కి శ్రుతి మెస్మరైజింగ్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి