Shruti Haasan: ఓరీ కామెంట్స్ పై శ్రుతి హాసన్ సీరియస్.. మరోసారి పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్..
కొద్దిరోజుల క్రితం ఓరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రుతిహాసన్ తనతో సరిగ్గా ప్రవర్తించలేదని..తనతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో రూడ్ గా ప్రవర్తించిందని.. బహుళా ఆమె భర్తతో తను సన్నిహితంగా ఉండడం నచ్చలేదేమో అంటూ చెప్పుకొచ్చాడు. శ్రుతిహాసన్ స్నేహితుడు శంతను హజారికను ఆమె భర్త అని సంబోధించడంతో మ్యారేజ్ రూమర్స్ మరోసారి వైరలయ్యాయి. అయితే తన మ్యారెజ్ గురించి వస్తున్న వార్తలను ఖండించింది శ్రుతి. తనకు పెళ్లి కాలేదని.. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే తాను..

ఇటీవల కొద్ది రోజుల క్రితం శ్రుతిహాసన్ పెళ్లి గురించి రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు శంతను హజారికను శ్రుతి రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం నడిచింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్ ఓరీ చేసిన కామెంట్లతో శ్రుతి పెళ్లి గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. కొద్దిరోజుల క్రితం ఓరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రుతిహాసన్ తనతో సరిగ్గా ప్రవర్తించలేదని..తనతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో రూడ్ గా ప్రవర్తించిందని.. బహుళా ఆమె భర్తతో తను సన్నిహితంగా ఉండడం నచ్చలేదేమో అంటూ చెప్పుకొచ్చాడు. శ్రుతిహాసన్ స్నేహితుడు శంతను హజారికను ఆమె భర్త అని సంబోధించడంతో మ్యారేజ్ రూమర్స్ మరోసారి వైరలయ్యాయి. అయితే తన మ్యారెజ్ గురించి వస్తున్న వార్తలను ఖండించింది శ్రుతి. తనకు పెళ్లి కాలేదని.. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే తాను.. ఈ విషయం ఎందుకు దాచిపెడతాను అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో శ్రుతి పెళ్లి రూమర్లకు చెక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి మ్యారేజ్ రూమర్స్ పై స్పందించింది శ్రుతి.
ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మాట్లాడుతూ..”నేను అద్దంలాంటి మనిషిని. ప్రజలు నాతో ఎలా ప్రవర్తిస్తారో… నేను అలాగే ప్రవర్తిస్తాను. నేనెప్పుడు చింతించను. సానుకూల వ్యక్తులు.. ప్రశాంతంగా ఉండే పరిసరాలపై దృష్టి సారిస్తాను. ఓరీ ఎవరో నాకు తెలియదు. నేను నా పని చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ బిజీగా ఉన్నాను.” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
అలాగే మరోసారి పెళ్లి రూమర్స్ పై స్పందిస్తూ.. “ఇది చాలా పిల్లతనం. నా గురించి తెలియని వారు మాట్లాడకూడదని కోరుకుంటున్నాను. నేను పూర్తిగా ఒంటరిగా నిజాయితీతో నా జీవితాన్ని గడిపాను. నాకు పెళ్లయితే ఎందుకు దాచిపెడతాను? ఈ వార్తతో నా సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు నేను ఒక క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశాను. అది సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల విడుదలైన సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది శ్రుతి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.