Shravya Varma: బ్యాడ్మింటన్ స్టార్‌తో పెళ్లిపీటలు ఎక్కనున్న ఆర్జీవీ మేన కోడలు.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు త్వరలో పెళ్లి పీట‌లు ఎక్కనుంది. ప్రముఖ సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్లార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

Shravya Varma: బ్యాడ్మింటన్ స్టార్‌తో పెళ్లిపీటలు ఎక్కనున్న ఆర్జీవీ మేన కోడలు.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్
Srikanth Kidambi, Shravya Varma
Follow us

|

Updated on: Aug 11, 2024 | 6:10 PM

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు త్వరలో పెళ్లి పీట‌లు ఎక్కనుంది. ప్రముఖ సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్లార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను షేర్ చేశారు శ్రీకాంత్. ‘ శ్రావ్య నాకు ఓకే చెప్పింది. మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు రెడీ అవుతున్నాం’ అంటూ తమ పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు శ్రీకాంత్. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీంతో పలువురు సినీ, క్రీడా సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా శ్రావ్య వర్మ పలు తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గానూ ఆమెను తన మేన కోడలిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆర్జీవీ. శ్రావ్య వర్మ సోషల్ మీడియా ఖాతాలను ఒక సారి పరిశీలిస్తే.. ఆమె టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేసింది శ్రావ్య వర్మ. ప్రస్తుతం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ కూ కూడా ఆమే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రావ్య వర్మ నిర్మాతగానూ అభిరుచి చాటుకుంది. కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి జంటగా గుడ్ లక్ సఖి అనే సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

శ్రీకాంత్, శ్రావ్యల ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

ఇక స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. తన క్రీడా ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. కాగా గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్, శ్రావ్య నిశ్చితార్థం చేసుకొని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.

చిరంజీవితో శ్రావ్య వర్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..