ఆ నటి శవపేటిక మీద నా పేరు చూసి తట్టుకోలేకపోయా.. శివాజీ రాజా ఎమోషనల్ కామెంట్స్
హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించిన శివాజీరాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన దాదాపు 400 వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నరు. ఇటు వెండి తెరపై అటు బుల్లి తెరపై తన నటనతో మెప్పించారు.

ప్రముఖ నటుడు శివాజీ రాజా.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, కమెడియన్ గా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు శివాజీ రాజా. ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు శివాజీ రాజా.. ప్రస్తుతం ఆయన సహాయక పాత్రలు చేస్తూ అక్కట్టుకుంటున్నారు శివాజీ రాజా. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. తన స్నేహితుడు, నటుడు శ్రీహరి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీహరికి ఒక్కరో ఇద్దరో స్నేహితులు కాదని, ఆయనకు అనేకమంది స్నేహితులు ఉన్నారని తెలిపారు శివాజీ రాజా..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
అలాగే శ్రీహరి ఆరోగ్యం స్నేహితుల కారణంగానే పాడైందనే ఆరోపణల్లో నిజం లేదు అని శివాజీ రాజా అన్నారు. శ్రీహరితో తన ఎంటైర్ కెరీర్‌లో కేవలం ఐదు, ఆరు సార్లు మాత్రమే కలిసి మద్యం సేవించినట్లు తెలిపారు. శ్రీహరికి పాన్‌పరాగ్ మానేయమని, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని తాను స్వయంగా సలహా ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి తన వ్యసనాన్ని తానే మానేయాలని లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలని సూచించారు. తాను ధూమపానం మానేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే తాను పూర్తిగా మానేసినట్లు తెలిపారు. శ్రీహరి ఆరోగ్య క్షీణత తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని శివాజీ రాజా అన్నారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
శ్రీహరి చాలామంది డైరెక్టర్లకు జీవితాలను ఇచ్చారని, ఈసీ మీటింగ్‌లకు కూడా ఎక్కువ కష్టపడేవారని, అందరినీ కలుపుకుపోయేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ శకుంతల విషయంలో జరిగిన ఒక ఓ సంఘటనను కూడా శివాజీ రాజా పంచుకున్నారు. బ్యాంకాక్‌లో షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు శకుంతలకు గుండెపోటు వచ్చిందని, డబ్బులు లేక ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్నారని తెలిసి, తాను ఉన్నానని, మిగతా అంతా చూసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆ సంఘటన తర్వాత శకుంతల నాకు శివాజీ ఉంటే చాలు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడు అని ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలను శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు. ఆమె మరణానంతరం పార్థివ దేహం తీసుకువెళ్లే పెట్టె మీదమీద శివాజీ అనే పేరు రాసి ఉండటంచూసి తట్టుకోలేకపోయా.. అంటూ ఎమోష్నలయ్యారు శివాజీ రాజా.. దర్శకుడు తేజతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ, తేజ చాలామందిని పరిచయం చేసి స్టార్‌లను చేశారని అన్నారు. తేజకు తనంటే చాలా ఇష్టమని, తేజ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయినా, పది నిమిషాల తర్వాత మామూలుగా మారిపోతాడని, తాను, భరణి తేజకు చాలా సన్నిహితులమని శివాజీ రాజా వివరించారు.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
