AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు హోటల్ గదిలో..! భయంకరమైన సంఘటన గురించి చెప్పిన నటుడు మధు

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మధునందన్. హీరోలకు స్నేహితుడిగా, కమెడియన్ గా కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు అతడు నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో.. తక్కువ సమయంలోనే తెలుగులో పాపులర్ అయ్యాడు మధునందన్. అయితే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన మధునందన్..

ఆ రోజు హోటల్ గదిలో..! భయంకరమైన సంఘటన గురించి చెప్పిన నటుడు మధు
Madhunandan
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2026 | 5:28 PM

Share

మధునందన్ ఇలా పేరు చెప్తే ఎవ్వరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆయనను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధు మాట్లాడుతూ.. సంచలన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో తన నిజ జీవితంలో ఎదురైన ఒక విచిత్రమైన సంఘటనను పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. దేవుడిని, దెయ్యాలను బలంగా నమ్ముతానని చెప్పిన మధునందన్ తెలిపారు. రాజమండ్రిలోని ఒక హోటల్ గదిలో తనకు ఎదురైన దెయ్యం అనుభవాన్ని పంచుకున్నారు మధు. తాను ఎక్కడికి వెళ్లినా, హోటల్ గదుల్లో పడుకునే ముందు అక్కడున్న అదృశ్య శక్తులను డిస్టర్బ్ చేయనని, తనను కూడా డిస్టర్బ్ చేయవద్దని కోరుకుంటాను అని మధు తెలిపాడు..

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

మధునందన్ ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాత్రూంలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత, తన ఛాతీపై మూడు ఎర్రటి గీతలు కనిపించాయని, వాటిని మొదట ఉంగరాలు తగిలి ఉంటాయని భావించానని చెప్పారు. అయితే, తర్వాత తన వీపుపై కూడా అవే గుర్తులు ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని అనుకున్న సమయంలోనే, ఆయన పెట్టిన టవల్ స్థానం మారడం గమనించా అని అన్నారు. బట్టల బ్యాగ్ పక్కన ఉంచిన టవల్ తర్వాత చైర్ మీద కనిపించిందని, ఇది తనకు 200% ఖచ్చితంగా గుర్తుందని మధునందన్ స్పష్టం చేశారు. ఈ సంఘటన తర్వాత అదే రూంలో బస చేసిన మరో నటుడికి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఎదురైందని, అతను వెంటనే రూమ్ మార్చేశాడని తెలిపారు.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

ఈ అనుభవం తర్వాత కూడా, భయం కంటే అలాంటి శక్తులు ఉన్నాయనే నమ్మకం తనకు మరింత పెరిగిందని మధునందన్ తెలిపాడు. ఈ అనుభవం తర్వాత శంబాల సినిమా కథ విన్నప్పుడు తనకు చాలా నచ్చిందని మధునందన్ తెలిపారు. సినిమాలో తనది మూఢ నమ్మకాలు, కట్టుబాట్లు కలిగిన ఒక భయస్తుడి పాత్ర అయినప్పటికీ, కథ దేవుడి గురించి, చెడుపై మంచి విజయం సాధించడం గురించి కావడంతో కథ తనకు నచ్చిందని. బ్యాడ్ ఎనర్జీపై గుడ్ ఎనర్జీ గెలుస్తుందని, ఇది ఒక యూనివర్సల్ రూల్ అని మధు అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.