AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Movie: షూటింగ్‏లో పడవ బోల్తా.. కాంతార టీంకు నోటీసులు.. అసలేం జరిగిందంటే..

కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి నటిస్తున్న సినిమా కాంతార చాప్టర్ 1. ఈ చిత్రానికి స్వయంగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ టీంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో నటిస్తోన్న ముగ్గురు నటులు చనిపోయారు. అలాగే ఇటీవలే చిత్రయూనిట్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

Kantara Movie: షూటింగ్‏లో పడవ బోల్తా.. కాంతార టీంకు నోటీసులు.. అసలేం జరిగిందంటే..
Kantara 2 Movie
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2025 | 5:04 PM

Share

కాంతార చాప్టర్ 1.. దక్షిణాది సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవలే ఈమూవీ షూటింగ్ జరుగుతున్న పడవ బోల్తా పడింది. కానీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చిత్రయూనిట్ తెలిపింది. పడవ బోల్తా పడినప్పుడు అందులో రిషబ్ శెట్టితోపాటు దాదాపు 31 మంది నటీనటులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం చిత్రయూనిట్ కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

శివమొగ్గ జిల్లాలోని మణి రిజర్వాయర్ సమీపంలో నిన్న సాయంత్రం షూటింగ్ జరుగుతుండగా పడవ బోల్తా పడిందని సమాచారం. ఆ సమయంలో పడవలో దాదాపు 32 మంది ఉన్నారట. ప్రమాదం జరిగిన వెంటనే వారంత ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కొందరు స్వల్పంగా గాయపడడంతో వారికి శికారిపురలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అలాగే తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని తీవ్రంగా పరిగణించిన శివమొగ్గ జిల్లా మేజిస్ట్రేట్ చిత్ర బృందం షూటింగ్‌కు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారా ? షూటింగ్ సమయంలో అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారా ? అనే విషయాలపై తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.

అయితే చిత్రయూనిట్ జిల్లా యాంత్రాంగం నుంచి కాకుండా కేవలం బెంగుళూరు నుంచి మాత్రమే అనుమతులు తీసుకున్నారని.. దీంతో మూవీ టీంకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ గురుదత్తా హెగ్డే తెలిపారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో నటిస్తోన్న ముగ్గురు నటులు వివిధ కారణాలతో మృతిచెందారు.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?