Tollywood: సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ధర ఎంతో తెలుసా?
తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోన్న ఈ అందాల తార తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోయిన్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది హీరోయిన్ ఆకాంక్ష సింగ్. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. అక్కినేని సుమంత్ ఫీల్ గుడ్ మూవీ మళ్లీ రావా హీరోయిన్ అంటే ఇట్టే ఓ అందమైన రూపం కళ్ల ముందు మెదులుతుంది. 2017లో బద్రీనాథ్ కి దుల్హనియా సినిమాతో తెరంగేట్రం చేసిందీ అందాల తార. ఆ ఆర్వాత తెలుగులో మళ్లీ రావా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే న్యాచురల్ స్టార్ నాని , నాగార్జున కలిసి నటించిన దేవదాస్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. పలు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం షష్టి పూర్తి. ‘లేడీస్ టైలర్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చన తిరిగి 37 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమాలో జంటగా నటించారు. శుక్రవారం (మే30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అని చూసిన వారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఈ క్రమంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కొత్త కారు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ SUV, XEV 9e EVని సొంతం చేసుకుందీ అందాల తార. ఆకాంక్ష సింగ్ కొత్త కారుతో నిలబడి ఉన్న ఫొటోలను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖలు, అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీలు బాగా ఇష్టపడే ఈ ఎలక్ట్రిక్ SUVకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక మహీంద్రా XEV 9e EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.90 లక్షల నుండి రూ. 30.50 లక్షల వరకు ఉంటుంది.
కొత్త కారుతో ఆకాంక్ష సింగ్..
View this post on Instagram
View this post on Instagram








