బర్త్ డే బాయ్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు..డైరెక్టర్ ఎవరంటే..?
యంగ్ హీరో శర్వానంద్ శుక్రవారం తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ‘రెడ్’ సినిమా చేస్తోన్న కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. కెరీర్ తొలినాళ్ల నుంచి కెరీర్‌ను చక్కగా బిల్డ్ చేసుకున్న శర్వా, ఇప్పుడు కిశోర్ తిరుమలతో ఏ తరహా సబ్జెక్ట్ చెయ్యబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ […]
యంగ్ హీరో శర్వానంద్ శుక్రవారం తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ‘రెడ్’ సినిమా చేస్తోన్న కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. కెరీర్ తొలినాళ్ల నుంచి కెరీర్‌ను చక్కగా బిల్డ్ చేసుకున్న శర్వా, ఇప్పుడు కిశోర్ తిరుమలతో ఏ తరహా సబ్జెక్ట్ చెయ్యబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ క్యాస్టింగ్, టెక్నిషియన్ల గురించి త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం శర్వానంద్, కిశోర్ అనే కొత్త డైరెక్టర్‌తో ‘శ్రీకారం’ మూవీ చేస్తున్నారు. వ్యవసాయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది.
Birthday Wishes to the Finest Actor, Hero #Sharwanand ?
Happy to collaborate with you for our #ProductionNo3 .#HBDSharwa @SLVCinemasOffl #SudhakarCherukuri #TirumalaKishore pic.twitter.com/AlKbKg1gww
— SLV Cinemas (@SLVCinemasOffl) March 6, 2020