Pathaan SRK Poster: ‘పఠాన్’గా మారిన కింగ్ ఖాన్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

|

Jun 25, 2022 | 6:12 PM

30 Years of Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో 2018లో జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు షారుక్.

Pathaan SRK Poster: పఠాన్గా మారిన కింగ్ ఖాన్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
Shahrukh Khan
Follow us on

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shah Rukh Khan)సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో 2018లో జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు షారుక్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు కింగ్ ఖాన్. ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు షారుక్. వాటిలో ఒకటి తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ కాగా.. మరొకటి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న పఠాన్. ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నేటితో షారుక్ సినీ ప్రయాణానికి 30 ఏళ్ళు . 1992 జూన్ 25న విడుదలైన ‘దీవానా’ సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకుంటూ వచ్చారు. షారుక్ 30ఏళ్ల  సినీ ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పఠాన్ సినిమానుంచి షారుక్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో షారుక్ చాలా అగ్రసివ్ గా కనిపిస్తున్నారు. ఒంటి నుండా గాయాలతో చేతిలో గన్ తో షారుక్ లుక్ అదిరిపోయింది. గ్యాంగ్ స్టర్ పఠాన్ గా షారుక్ రగ్గడ్ లుక్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె.. జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పఠాన్ సినిమా జనవరి 25 2023నప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి