Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పరిస్థితేంటి..? షూటింగ్ మొదలైనటేనా..?

టాలీవుడ్ లో ఇటీవల సంచలనం సృష్టించిన సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మ్యాజిక్.. అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి.

Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' పరిస్థితేంటి..? షూటింగ్ మొదలైనటేనా..?
Pushpa 2
Follow us

|

Updated on: Jun 25, 2022 | 7:31 PM

టాలీవుడ్ లో ఇటీవల సంచలనం సృష్టించిన సినిమాల్లో పుష్ప(Pushpa ) సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మ్యాజిక్.. అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. బన్నీ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత విడుదలై సంచనలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలైందా.. ? లేక అవ్వబోతుందా..? అసలు పుష్ప 2 అప్డేట్ ఏంటి అన్నది మాత్రం ఎవ్వరికి తెలియడం లేదు.

మారేడుమిల్లి అడవుల్లో మొదటి పార్ట్ షూట్ చేసిన సుకుమార్. ఇప్పుడు పార్ట్ 2 ను ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు.? అన్నది అభిమానుల్లో జరుగుతోన్న ఆసక్తికర చర్చ. అయితే పుష్ప 2 పై ఇంతవరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొదటి పార్ట్ అంతా ఇండియా లోనే షూట్ చేసిన సుకుమార్ టీమ్. ఇప్పుడు పార్ట్ 2 కోసం విదేశాలకు ఎగిరిపోతోందట. సెకండ్ పార్ట్ కోసం  ఇండోనేషియా, సింగపూర్ లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. పార్ట్ 2ను ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట సుకుమార్. పుష్ప 1 కు మించి ఈ సినిమాలో విజువల్స్ అబ్బుర పరిచే స్థాయిలో వుంటాయని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి