Shah Rukh Khan Birthday Special: కింగ్ ఖాన్ స్టామినా.. షారుక్ ఖాన్ మూవీ అంటే వెయ్యి కోట్లు పక్కా
నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడం షారుఖ్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు షారుక్. బాలీవుడ్ స్థాయిని పెంచడం లో షారుఖ్ పాత్ర ఉందనడంతో అతిశయోక్తి లేదు. నేడు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. షారుఖ్ బర్త్ డేను అభిమానులు పండగలా జరుపుకుంటుంటారు. ప్రతి సంవత్సరం ముంబై లోని ఆయన ఇంటి దగ్గర వందలాది మంది షారుక్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వస్తుంటారు.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. స్టార్ హీరోగా ఆయనకున్న క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడం షారుఖ్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు షారుక్. బాలీవుడ్ స్థాయిని పెంచడం లో షారుఖ్ పాత్ర ఉందనడంతో అతిశయోక్తి లేదు. నేడు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. షారుఖ్ బర్త్ డేను అభిమానులు పండగలా జరుపుకుంటుంటారు. ప్రతి సంవత్సరం ముంబై లోని ఆయన ఇంటి దగ్గర వందలాది మంది షారుక్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వస్తుంటారు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో నిన్న అర్ధరాత్రి నుంచే అభిమానులు షారుక్ ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు.
షారుఖ్ ఖాన్ హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. షారుక్ ఇప్పటివరకు 90 కి పైగా సినిమాల్లో నటించాడు. అలాగే 14 ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. గతంలో షారుఖ్ ఖాన్ సినిమాలు ఏడాది మూడు లేదా నాలుగు రిలీజ్ అయ్యేవి. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు. అలాగే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించాడు.
ఇక మొన్నామధ్య షారుఖ్ నటించిన సినిమాలనే వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. 2018 లో వచ్చిన జీరో సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో షారుక్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2018 నుంచి 2013 వరకు షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా చేయలేదు. మధ్యలో మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇక 2023 లో పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 1000 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాతో అభిమానుల్లో జోష్ నింపిన కింగ్ ఖాన్.. జవాన్ సినిమాతో ఆ ఆనందాన్ని డబుల్ చేశాడు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం 1000 కోట్లకు పైగా వసూల్ చేసి షారుక్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు చూపించింది. ఇక ఇప్పుడు డంకి అనే సినిమా చేస్తున్నాడు షారుఖ్.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
