AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sana Begum: సీనియర్ నటి భర్తకు గుండెపోటు.. అభిమానులకు క్షమాపణలు చెబుతూ పోస్ట్.. ఎందుకంటే..

సహయనటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ పాత్రలు పోషిస్తూనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు సినిమాలు, సీరియల్స్ అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే సనా.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ విషయాలు.. మూవీ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. అయితే కొన్ని రోజులుగా సనా నెట్టింట అంత యాక్టివ్ గా ఉండడం లేదు.

Sana Begum: సీనియర్ నటి భర్తకు గుండెపోటు.. అభిమానులకు క్షమాపణలు చెబుతూ పోస్ట్.. ఎందుకంటే..
Sana Begum
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2024 | 3:17 PM

Share

సనా బేగమ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది. అటు బుల్లితెరపైనా కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ బిగ్ స్క్రీన్ పై కీలకపాత్రలు పోషిస్తుంది. అమ్మ, అత్త, అక్క, వదినా ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సనా.. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. సహయనటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ పాత్రలు పోషిస్తూనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు సినిమాలు, సీరియల్స్ అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే సనా.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ విషయాలు.. మూవీ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. అయితే కొన్ని రోజులుగా సనా నెట్టింట అంత యాక్టివ్ గా ఉండడం లేదు.

ఇక ఐదారు రోజుల నుంచి ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. ఇక ఈరోజు రంజాన్ పండుగ. కానీ ఇంతవరకు సనా ఇన్ స్టా ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సనా ఎందుకు యాక్టివ్ గా లేదు అంటూ కంగారుపడిపోయారు అభిమానులు. ఆమె ఎందుకు ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదంటూ కారణాలు అడుగు మెసేజ్ లు చేశారు. ఇక ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది సనా.

Sana

Sana

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి గల కారణాన్ని ఇన్ స్టా స్టోరీలో వెల్లడించింది. “ఇన్ స్టాలో, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండనందుకు నన్ను క్షమించండి. కొన్ని రోజుల క్రితం నా భర్తకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పింది. అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మీ ఆదరాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ సనా బేగం భర్త త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.