Suraj Mehar: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం.. రోడ్డు ప్రమాదంలో నటుడి మృతి..
సూరజ్ మెహర్ ఆఖ్రీ ఫైస్లా షూటింగ్ ముగించుకుని బిలాస్‌పూర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న స్కార్పియో ముందు నుండి వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సూరజ్ మృతితో ఇండస్ట్రీలో, అతడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఒడిశాలో సూరజ్ మెహర్ నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చత్తీస్‌గడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్ (40) మరణించాడు. అర్దరాత్రి అతడి కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం, సూరజ్ మెహర్ ఆఖ్రీ ఫైస్లా షూటింగ్ ముగించుకుని బిలాస్‌పూర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న స్కార్పియో ముందు నుండి వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సూరజ్ మృతితో ఇండస్ట్రీలో, అతడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఒడిశాలో సూరజ్ మెహర్ నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
మరికొన్ని గంటల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు బంధువులకు సమాచారం అందించారు స్థానికులు. సూరజ్ మెహర్ సరియా బిలాయిగఢ్ గ్రామ నివాసి. నటుడి మృతిపై కేసు నమోదు చేసిన చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది ?… వాహనం నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యమా ? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఈరోజు సూరజ్ అంత్యక్రియలు స్వగ్రామంలో జరగనున్నాయి.
సూరజ్ మెహర్ విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో సూరజ్ మృతి పట్ల ప్రముఖ ఛత్తీస్‌గఢి, భోజ్‌పురి సినీ నటుడు, హాస్యనటుడు ప్రదీప్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. “ఏప్రిల్ 9న సూరజ్ మెహర్ నాతో “ఆఖ్రీ ఫైస్లా” సినిమా షూటింగ్‌ని అర్ధరాత్రి 2 గంటల వరకు పూర్తి చేసాడు. ఏప్రిల్ 11న అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. సూరజ్ మెహర్‌కు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు ఇలాంటి బాధాకరమైన సమయంలో దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని అతని కుటుంబానికి తీరని లోటును భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. గతంలో బిలాస్‌పూర్ నటుడు అనుపమ్ భార్గవ కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
