Simran: ఈ వయసులోనూ ఏం ఎనర్జీ..! మహేష్ సాంగ్‌కు మాస్ స్టెప్పులేసిన సిమ్రాన్
పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది. సిమ్రాన్ అసలు పేరు రిషిబాల నావల్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత సిమ్రాన్ గా పేరు మార్చుకుంది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించారు సిమ్రాన్.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ సిమ్రాన్.. ఈ బ్యూటీకి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు సిమ్రాన్. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది. సిమ్రాన్ అసలు పేరు రిషిబాల నావల్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత సిమ్రాన్ గా పేరు మార్చుకుంది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించారు సిమ్రాన్. సీనియర్ హీరోలే కాదు.. మహేష్ బాబుతో కూడా నటించారు సిమ్రాన్. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సిమ్రాన్ అంతగా స్పీడ్ చూపించడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సిమ్రాన్ వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఈ చిన్నదానికి.. అదిరిపోయే డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు సిమ్రాన్. తాజాగా మహేష్ బాబు మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలరించింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎంత ఫెమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సాంగ్ కు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు. సెలబ్రెటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. తాజాగా సిమ్రాన్ కూడా ఈ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిమ్రాన్ ఎనర్జిక్ సెల్యూట్ చెయ్యాల్సిందే. ఈ వయసులోనూ ఆ రేంజ్ లో డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
సిమ్రాన్ డాన్స్ వీడియో..
View this post on Instagram
సిమ్రాన్ డాన్స్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




