Atlee Kumar: షారుక్ ఖాన్ కాళ్ల మీద పడ్డ డైరెక్టర్ అట్లీ.. వీడియో వైరల్
అట్లీ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేశాడు. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన 'జవాన్' నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జవాన్ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. తాజాగా జీ సినీ అవార్డ్స్ 2024 లోనూ జవాన్ సినిమా సత్తా చాటింది.

తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు అట్లీకి ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దానికి కారణం ‘జవాన్’ సినిమా. అట్లీ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా ఇది. అట్లీ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేశాడు. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘జవాన్’ నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జవాన్ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. తాజాగా జీ సినీ అవార్డ్స్ 2024 లోనూ జవాన్ సినిమా సత్తా చాటింది. ‘జవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు అట్లీ ‘జీ సినీ అవార్డ్స్ 2024’లో ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డును గెలుచుకున్నారు.
అవార్డు ప్రదానోత్సవంలో అట్లీ పేరు ప్రకటించగానే అక్కడున్నవారు హోరెత్తించారు. అవార్డును అందుకోవడానికి వేదికపైకి వెళ్లే ముందు అట్లీ షారుక్ ఖాన్ పాదాలకు నమస్కరించాడు. దాన్ని అడ్డుకునేందుకు షారూఖ్ ముందుకొచ్చాడు. తన కాళ్లపై పడేందుకు వచ్చిన దర్శకుడిని షారుక్ ఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కింగ్ ఖాన్ పాదాలకు నమస్కరించిన తర్వాతే అట్లీ అవార్డు అందుకున్నాడు.
ఇప్పుడు అట్లీకి వయసు 37 ఏళ్లు. షారుఖ్ ఖాన్ వయసు 58 ఏళ్లు. వీరిద్దరి మధ్య 21 ఏళ్ల గ్యాప్ ఉంది. అట్లీ తన కంటే సీనియర్ అయిన షారుక్ ఖాన్‌కు ఇలా అట్లీ గౌరవం ఇచ్చాడు. వైరల్ అయిన ఈ వీడియోపై అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అట్లీ దర్శకుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. అతని సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సినిమాలకే దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు బాలీవుడ్‌లో డిమాండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న ‘బేబీ జాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మే 31న సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




