తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే డైరెక్టర్ విశ్వనాధ్, సింగర్ వాణీ జయరాం మరణాలను జీర్ణించుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో సినీ రచయిత.. సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి లక్ష్మి నరసింహశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడ, తమిళ చిత్రాలకు రచనలు చేశారు యడవల్లి. ఇండస్ట్రీలో యడవల్లిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
నెల్లూరులో జన్మించిన ఆయన.. ఆ తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే నక్షత్రాలు పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు.. యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకు యడవల్లి అంకితం చేశారు.
అలాగే పలు టీవీ సీరియల్ కు కథలు.. మాటలు సమకూర్చారు. ప్రస్తుతం యడవల్లి కేంద్ర సెన్సార్ బోర్ట్ సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు ముగిశాయి.