Actress Meena: బాలయ్య సరసన మరోసారి నటించనున్న అందాల సీనియర్ నటి..

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలబోసినా ఈ మూడుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Actress Meena: బాలయ్య సరసన మరోసారి నటించనున్న అందాల సీనియర్ నటి..
meena-.

Updated on: May 07, 2021 | 8:58 AM

Actress Meena:

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలబోసినా ఈ మూడుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించారు మీనా. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి అలరించింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తుంది. అలాగే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో మీనా నటిస్తుందని తెలుస్తుంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమా గురించి రోజుకొక వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ కు జోడీగా మీనా నటిస్తున్నారని టాక్. ఈ సినిమాలోని బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందట. అప్పుడు ఆయన భార్య పాత్రలో మీనా కనిపించనుందని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mandela Remake: త‌మిళ చిత్రం మండేలా రీమేక్‌లో న‌టించేది బండ్ల గ‌ణేశ్ కాదంటా.. తాజాగా వినిపిస్తోన్న కొత్త పేరు..

Genelia Reentry: భ‌ర్త నుంచి అనుమ‌తి పొందిన హాసిని.. టాలీవుడ్‌లోనే జెనిలీయా రీ ఎంట్రీ.?

Tamannah November Story: ఇంత‌కీ ఆ హ‌త్య చేసింది ఎవ‌రు.? ఆస‌క్తిక‌రంగా న‌వంబ‌ర్ స్టోరీ ట్రైల‌ర్‌..