Wayanad Landslide: వయనాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించిన అలనాటి హీరోయిన్లు.. మొత్తం ఎంత పోగేశారో తెలుసా?

దేవతలు నడయాడే ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన కేరళలో ఇలాంటి విషాద ఘటన జరగడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అందుకే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి, చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు..

Wayanad Landslide: వయనాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించిన అలనాటి హీరోయిన్లు.. మొత్తం ఎంత పోగేశారో తెలుసా?
Senior Actresses

Updated on: Aug 10, 2024 | 8:55 PM

ఇటీవల కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఏకంగా 300 మంది మృత్యువాత పడ్డరు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియడం లేదని సహాయక చర్యలు చేపడుతోన్న అధికారులు చెబుతున్నారు. కాగా దేవతలు నడయాడే ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన కేరళలో ఇలాంటి విషాద ఘటన జరగడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అందుకే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి, చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక మందన్నా 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు.. ఇలా పలువురు సెలబ్రిటీలు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేశారు. తాజాగా అలనాటి హీరోయిన్లు కూడా తాము కలిసి పోగేసిన మొత్తాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ కు అందించారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది సినీ తరులు నేరుగా వెళ్లి కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రికి అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘ చెన్నై నుంచి మేం కొంతమంది మా కుటుంబ సభ్యులు, స్నేహితుల తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాం. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన.. తదితరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. వయనాడ్ త్వరగా కోలుకోవాలని మేం ప్రార్ధిస్తున్నాం’ అని పోస్ట్ లో రాసుకొచ్చింది మీనా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వయనాడ్ బాధితుల కోసం ఈ సీనియర్ హీరోయిన్లు చేసిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కేరళ సీఎం పినరయి విజయన్ తో సీనియర్ హీరోయిన్లు..

కేరళలో మెగా స్టార్ చిరంజీవి.. ఫొటోస్..

 వీడియో ఇదిగో..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.