పెద్ద సినిమా చేసినా మాకు ఇచ్చేది తక్కువే.. నేను ఎక్కువగా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే
తెలుగులో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఎన్నో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. వారిలో శివ పార్వతి ఒకరు. అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు శివపార్వతి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శివపార్వతి

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు సీనియర్ నటి శివ పార్వతి. అమ్మగా , అత్తగా, వదినగా ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించారు శివ పార్వతి. ఆమె పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన ఆమె తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయత కంటే హ్యాండ్‌బ్యాగ్, బ్యాంక్ బ్యాలెన్స్, నగలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు అని ఆమె అన్నారు. డబ్బు లేనిదే మనిషి బ్రతకలేడని, ఈ విషయం పదేళ్ల పిల్లలకు కూడా అర్థమవుతోందని ఆమె చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులను కూడా డబ్బుతోనే గౌరవిస్తున్నారని, ఒరిజినల్ ప్రేమలు మటుమాయమయ్యాయని అన్నారు శివ పార్వతి
కళాకారుల కుటుంబాల్లో ఒకరు మాత్రమే సంపాదిస్తున్నప్పుడు ఎదురయ్యే ఆర్థిక, సామాజిక సవాళ్లను శివ పార్వతి వివరించారు. ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారికి గౌరవం ఉంటుందని, తక్కువ సంపాదించేవారికి పెద్దగా గౌరవం ఉండదని ఆమె అన్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను పాటించాలని, పని చేయలేని వయసులో కూడా ప్రశాంతంగా ఉండటానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఇది అవసరమని తెలిపారు శివ పార్వతి.
చిరంజీవి, బాలకృష్ణ వంటి గొప్ప కళాకారులు సైతం వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులను పక్కనపెట్టి ప్రేక్షకుల ఆనందం కోసమే పని చేస్తారని శివ పార్వతి అన్నారు. కళాకారులు ప్రజల గుర్తింపు పొందడం, వారి ఆనందాన్ని చూడటమే గొప్ప తృప్తి అని శివ పార్వతి అన్నారు. తనక ఆలోచనలు మధ్య తరగతిగానే ఉన్నాయని, లక్షల కోట్ల సంపాదన లేదని, తనకు కావాల్సినంత మాత్రమే సంపాదించుకున్నానని ఆమె అన్నారు. ఉండడానికి ఇల్లు, భోజనం, సమాజంలో గౌరవంగా బతకడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్‌లో అత్యధికంగా ఒక సినిమాకు రూ.3 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నానని తెలిపారు. అన్నమయ్య వంటి పెద్ద సినిమాల్లో నటించినా క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పరిమితులు ఆమె వివరించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




