Jayamalini: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అలనాటి అందాల నటి జయమాలిని..

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ వీరసింహారెడ్డి సినిమాను అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.

Jayamalini: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అలనాటి అందాల నటి జయమాలిని..
Balakrishna, Jayamalini
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2023 | 5:34 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ వీరసింహారెడ్డి సినిమాను అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక వీరసింహ రెడ్డి సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య, సుగుణ సుందరి, మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు.. అలనాటి అందాల తార జయమాలిని.

వీరసింహారెడ్డి సినిమాలోని మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటకు డాన్స్ చేశారు జయమాలిని, ప్రముఖ యూట్యూబర్ తో కలిసి జయమాలిని ఈ పాటకు డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీయస్యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జయమాలిని ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలతో పాటు చిరంజీవి, బాలయ్య సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేశారు. ఆమెకు బాలకృష్ణ అంటే ప్రత్యేక అభిమానం. ఇటీవలే అన్ స్టాపబుల్ షూటింగ్ సెట్ కు వెళ్లి కూడా ఆయనను కలిశారు జయమాలిని. ఇక వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 న ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సంక్రాంతి బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..