Actress Gautami: ఆ వ్యక్తి పదే పదే మోసం చేస్తుంటారు.. రిలేషన్షిప్లో నేను చేసిన తప్పు అదే.. గౌతమి కామెంట్స్..
ఓ మ్యూజిక్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకుంది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గౌతమి.. చిన్న వయసులోనే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే పాప జన్మించింది. బిడ్డ పుట్టిన ఏడాదికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న గౌతమి.. హీరో కమల్ హాసన్ ప్రేమలో పడింది. వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేశారు.
సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన తారలు.. జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ నిజజీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ వంటివాటితో మానసిక క్షోభకు గురవుతుంటారు. చాలాకాలం పాటు రిలేషన్ షిప్, బ్రేకప్ సంఘర్షణలో పడిపోయినవారు ఇప్పుడిప్పుడే తమ బాధను బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ గౌతమ తన జీవితం ఎదురైన పరిస్థితులను చెప్పుకొచ్చింది. అలాగే రిలేషన్ షిప్, బ్రేకప్ చాలా బాధిస్తాయని తెలిపింది. ఓ మ్యూజిక్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకుంది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గౌతమి.. చిన్న వయసులోనే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే పాప జన్మించింది. బిడ్డ పుట్టిన ఏడాదికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న గౌతమి.. హీరో కమల్ హాసన్ ప్రేమలో పడింది. వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేశారు.
కానీ అంతలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2016లో వీరు విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. “నిజానికి మీ బలం మీరే. మీరు విచారంగా ఉన్నప్పుడు మీకు ధైర్యం కలిగించే వ్యక్తి వీడియోస్ చూస్తారు. కానీ ఒక్కొక్క వ్యక్తి ఆలోచనలు మారుతుంటారు. ఒక్కొక్కరికి వేరు వేరు విషయాలు స్పూర్తినిస్తాయి. అందరూ అదే పాయింట్ వెళ్తారు. కానీ అదేమి కాదు. మీ బలం మీరే. మీ రిలేషన్ షిప్ వర్కౌట్ కాలేదంటే పూర్తి బాధ్యత మీరు వహించాల్సిన అవసరం లేదు. తండ్రి, తల్లి, కుమార్తె, భర్త, ప్రేమికుడు ఇలా ఏ బంధమైన సరే ఆ బంధంలో ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఇదిరి మధ్య కేంద్రబింధువు ఉంటుంది.
ఇద్దరూ అక్కడికి చేరుకోవాలి. కానీ కొన్నికారణాలతో మరొకరు చేరుకోలేరు. మనకోసం ఇంత దూరం వచ్చారా అని అవతలి వ్యక్తి కోసం ఆలోచిస్తుంటాం. అదే వారికి ఇంకా అలవాటు చేస్తాం. మనకోసమే అంత దూరం వచ్చానని అవతలి వ్యక్తి భావిస్తాడు. కానీ ఒకసారి మోసం చేసిన వ్యక్తి మళ్లీ మళ్లీ మోసం చేస్తూనే ఉంటాడు. నీకోసం నేనెందుకు రావాలి.. నువ్వే వచ్చాయ్ అంటూ ప్రశ్నిస్తారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాటం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. ప్రేమ రెండు వైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.