బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా కైవసం చేసుకున్న అవార్డ్స్..

TV9 Telugu

26 March 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది అందాల తార రాశి ఖన్నా.

తన అందం, అభినేయంతో తెలుగు కుర్రాళ్ల మనసులో చోటు సంపాదించింది. ఈ వయ్యారి నటనకు కొన్ని అవార్డులు వరించాయి.

2015లో సైమా అవార్డ్స్ వేడుకలో ఊహలు గుసగుసలాడే చిత్రంలో ఈమె నటనకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – తెలుగు అవార్డ్ అందుకుంది.

అదే ఏడాది సినీమా అవార్డ్స్ వారిచే ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈమె నటనకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్ కైవసం చేసుకుంది.

2016లో జీ తెలుగు అప్సర అవార్డ్స్ వేడుకలో మోస్ట్ గ్లామరస్ దివా ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుపొందింది ఈ అమ్మడు.

2017లో TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో జై లవ కుశలో కథానాయకిగా ఈమె నటనకి ఉత్తమ నటి అవార్డు వరించింది.

2019లో జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే తొలి ప్రేమ సినిమాలో ఈ భామ నటనకు ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ వరించింది.

2021లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో ప్రతి రోజు పండగే, వెంకీ మామా సినిమాల్లో ఆమె నటనకు అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా అవార్డ్ కైవసం చేసుకుంది.