Chandra Mohan: చంద్రమోహన్ మరణం పై సినీ ప్రముఖుల విచారం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్

ఆరడుగుల అందగాడు కాకపోయినా.. తన నటనతో హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్. గత గొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు 9.45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Chandra Mohan: చంద్రమోహన్ మరణం పై సినీ ప్రముఖుల విచారం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్
Chandra Mohan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 11, 2023 | 12:42 PM

చంద్రమోహన్ మరణం ఇండస్ట్రీని విషాదం లోకి నెట్టింది. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడిగా ఎన్నో అద్బుతపాత్రల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. ఆరడుగుల అందగాడు కాకపోయినా.. తన నటనతో హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్. గత గొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు 9.45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వెదికాగా చంద్ర మోహన్ మృతికి సంతాపం తెలిపారు.

“సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.

నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. అంటి చిరంజీవి తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

అలాగే చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన మరణ ఆవార్త విని చాలా ఆవేదన చెందానని అన్నారు పవన్. చంద్రమోహన్ గారిని తెరపై చూడగానే మనకు పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది అని పవన్ తన లేఖలో ప్రస్తావించారు.

ఎన్టీఆర్ చంద్రమోహన్ మరణం పై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ” ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం” అని రాసుకొచ్చారు ఎన్టీఆర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..