AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు

చలపతిరావు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. టాలీవుడ్‌లో ఉన్న గ్రేట్ సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. కొన్ని వందల సినిమాల్లో, విభిన్న భాషల్లో, విభిన్న సినిమాలు చేసిన వెర్సటైల్ నటుడు చలపతిరావు. కానీ ఆయన నటుడిగా ఎంత ఫేమస్సో.. మెన్నా ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్‌తో ఇంకా ఎక్కువగా వార్తల్లోకెక్కాడు. ఆడవాళ్లపై ఆయన చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా విమర్శలకు గురయ్యాడు. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్‌కి […]

అప్పుడు సూసైడ్  చేసుకోవాలనుకున్నా: సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు
Veteran actor Chalapathi Rao is hitting the headlines for his controversial remarks which he had made on women's in 'Rarandoy Veduka Chuddam' audio function. Later, Chalapathi Rao has asked a public apology and now it got sorted. Recently, after the incident, He has given an interview to youtube channel where he revealed many interesting facts about his life.
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 12, 2019 | 12:03 PM

Share

చలపతిరావు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. టాలీవుడ్‌లో ఉన్న గ్రేట్ సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. కొన్ని వందల సినిమాల్లో, విభిన్న భాషల్లో, విభిన్న సినిమాలు చేసిన వెర్సటైల్ నటుడు చలపతిరావు. కానీ ఆయన నటుడిగా ఎంత ఫేమస్సో.. మెన్నా ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్‌తో ఇంకా ఎక్కువగా వార్తల్లోకెక్కాడు. ఆడవాళ్లపై ఆయన చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా విమర్శలకు గురయ్యాడు. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్‌కి గురయ్యాడు.

టీవీ ఛానల్స్‌లో చర్చా వేదికలు, స్పెషల్ డిబేట్లు ఒక్కటేమిటి ఆయన ఆ మంత్ అంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంటే అతిశయోక్తి కాదు.  ముఖ్యంగా మహిళా సంఘాలకి  ఆ టైంలో చలపతిరావు అనే వ్యక్తి మొయిన్ టార్గెట్ అయ్యాడు. ఆ మాట అన్నందుకు ఆయన ఎన్ని సార్లు క్షమాపణ చెప్పినా కూడా ఎవరూ కనీసం పట్టించుకోలేదు.  మీడియాలో ఆయన వ్యాఖ్యలపై భారీ స్థాయిలోనే నెగటివ్ ప్రచారం జరిగింది.

ఈ బాధ తట్టుకోలేక ఓ క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఆ సూసైడ్ నోట్‌ ద్వారా బాధపడ్డవారికి  క్షమాపణలు చెప్పాలనుకున్నట్లు  ఆయన చెప్పారు. మీరు నన్ను బతకనిచ్చేలా లేరు.. సారీ అమ్మా అని రాయాలనుకున్నానని తెలిపారు. తనకు 22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ  పెళ్లి చేసుకోలేదని.. అలాంటి తనపై ఇలాంటి విమర్శలు వచ్చేసరికి తట్టుకోలేకపోయానని చెప్పారు చలపతిరావు. ఏది ఏమైనా ఆయన ఆ విషయంలో ఏ స్థాయిలో మదనపడ్డారో తాజా వ్యాఖ్యలే నిదర్శనం. పశ్చాతాపానికి మించిన ప్రాయశ్చిత్తంలేదని పెద్దలంటారు. ఇప్పటికైనా ఆయన వ్యాఖ్యలను ప్రజలు క్షమిస్తారని ఆశిద్దాం.