AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్లేదు..సాయి ట్రాక్‌లోకి వచ్చాడు

సాయి ధరమ్ తేజ్..సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాక ఫేట్ వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ‘తేజ్ ఐ లవ్ యూ’ వరకు వరుస ప్లాపులతో అల్లాడిన ఈ మెగా హీరో..ఆ తర్వాత చిత్రలహారి, ఇప్పుడు ‘ప్రతి రోజు పండగే’ చిత్రంతో విజయాల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఒకనొక టైంలో సాయి తేజ్ మార్కెట్..హై రేంజ్‌కు వెళ్లింది. కమర్షియల్ కటౌట్‌తో పాటు, మెగా మేనల్లుడు అనే ట్యాగ్ మనోడి ఇమేజ్‌ని గగనానికి తీసుకెళ్లాయి.  సుప్రీంతో..కెరీర్ స్టార్ట్ చేసిన చాలా కొద్ది కాలంలోనే […]

పర్లేదు..సాయి ట్రాక్‌లోకి వచ్చాడు
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2019 | 9:30 PM

Share

సాయి ధరమ్ తేజ్..సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాక ఫేట్ వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ‘తేజ్ ఐ లవ్ యూ’ వరకు వరుస ప్లాపులతో అల్లాడిన ఈ మెగా హీరో..ఆ తర్వాత చిత్రలహారి, ఇప్పుడు ‘ప్రతి రోజు పండగే’ చిత్రంతో విజయాల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఒకనొక టైంలో సాయి తేజ్ మార్కెట్..హై రేంజ్‌కు వెళ్లింది. కమర్షియల్ కటౌట్‌తో పాటు, మెగా మేనల్లుడు అనే ట్యాగ్ మనోడి ఇమేజ్‌ని గగనానికి తీసుకెళ్లాయి.  సుప్రీంతో..కెరీర్ స్టార్ట్ చేసిన చాలా కొద్ది కాలంలోనే రూ. 25 మార్కెట్‌ను రీచ్ అయ్యాడు తేజ్. కానీ ఆ తర్వాత ప్లాపులు పరంపర కొనసాగింది. సుప్రీం తర్వాత తేజ్ 6 సినిమాలు చేయగా.. అందులో ఒక్కటి  కూడా యావరేజ్ అనిపించుకోలేదు.

మరీ దారుణంగా  ‘ఇంటిలిజెంట్’ అయితే రూ.5 కోట్ల వసూళ్లను కూడా చేయలేకపోయింది. దీంతో తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన   ‘చిత్రలహరి’ హిట్‌గా నిలిచి..కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.  ఇప్పుడు  ‘ప్రతి రోజూ పండగే’ కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ వీకెండ్‌లో మరో మూడు సినిమాలతో తేజ్ మూవీ పోటీ పడింది. అవన్నీ టపా కట్టడంతో..బాక్సాఫీసును రూల్ చేస్తున్నాడు సుప్రీం హీరో.  తొలి రోజు వరల్డ్ 7 కోట్లు గ్రాస్ రాబట్టిన..‘ప్రతి రోజూ పండగే’..రెండో రోజు ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఆదివారం వీకెండ్ కాబట్టి మంచి వసూళ్లు రావడం ఖాయం.  దీంతో ‘ప్రతి రోజూ పండగే’..తేజ్‌కు పండగను తీసుకొచ్చినట్టే అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టాక్ యావరేజ్‌గా ఉన్నా..ఇన్నాళ్లు వెంటాడిన టైం తేజ్‌కు ఇప్పుడు ప్లస్సయ్యింది. మొత్తం మీద రూ. 20 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు