రష్మికతో బ్రేకప్.. తొలిసారి స్పందించిన రక్షిత్.. ఏమన్నాడంటే..!

కిర్రీక్ పార్టీలో కలిసి నటించిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ఆ మూవీ షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు వర్గాల పెద్దలను ఒప్పించుకొని ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన గతేడాది తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు వీరిద్దరు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి బ్రేకప్ అవ్వడానికి గల కారణాలపై వీరిద్దరికి పలు సందర్భాలలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఓ సందర్భంలో రష్మిక మట్లాడుతూ.. మేమిద్దరం మొదట కెరీర్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. […]

రష్మికతో బ్రేకప్.. తొలిసారి స్పందించిన రక్షిత్.. ఏమన్నాడంటే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 22, 2019 | 5:17 PM

కిర్రీక్ పార్టీలో కలిసి నటించిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ఆ మూవీ షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు వర్గాల పెద్దలను ఒప్పించుకొని ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన గతేడాది తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు వీరిద్దరు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి బ్రేకప్ అవ్వడానికి గల కారణాలపై వీరిద్దరికి పలు సందర్భాలలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఓ సందర్భంలో రష్మిక మట్లాడుతూ.. మేమిద్దరం మొదట కెరీర్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. అందుకే విడిపోతున్నాం అని తెలపగా.. తొలిసారి తమ బ్రేకప్‌పై రక్షిత్ శెట్టి స్పందించాడు.

సచిన్ రవి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి అవనే శ్రీమన్నారయణ(తెలుగులో అతడే శ్రీమన్నారయణ) అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 27న ఈ మూవీ విడుదల అవ్వబోతుండగా.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు రక్షిత్. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రష్మికతో బ్రేకప్ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “జీవితం మనకు ఎన్నో రకాలైన అనుభవాలను పరిచయం చేస్తుంది. వాటిలో కొన్ని మంచివి ఉండొచ్చు. ఇంకొన్ని చెడ్డవై ఉండొచ్చు. కానీ ప్రతి అనుభవాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది. మంచి వ్యక్తిగా ఎదిగే క్రమంలో ప్రేమ, స్నేహం, బంధం విషయంలో ఎన్నో బ్రేక్‌లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. ఎందుకంటే జీవితంలో ఇవన్నీ చాలా చిన్న విషయాలు. మనకు ఎదురైన అనుభవాల నుంచి మంచి విషయాలను నేర్చుకోవడమే జీవిత పరమార్థం” అని చెప్పుకొచ్చారు. కాగా 2017లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగగా.. 2018లో రక్షిత్, రష్మిక విడిపోయారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu