AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సరిలేరు నీకెవ్వరు’ మేకింగ్ వీడియో.. ‘డీఎస్పీ మీరు నిజంగా రాక్‌స్టార్’..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. అతడి సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మూవీపై మరింత అంచనాలను పెట్టేందుకు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది […]

'సరిలేరు నీకెవ్వరు' మేకింగ్ వీడియో.. 'డీఎస్పీ మీరు నిజంగా రాక్‌స్టార్'..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 22, 2019 | 3:39 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. అతడి సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మూవీపై మరింత అంచనాలను పెట్టేందుకు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఓ వీడియోను విడుదల చేశాడు.

అందులో సరిలేరు నీకెవ్వరు టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన రికార్డింగ్ సెషన్‌ను విడుదల చేశాడు. యూరప్‌లోని మెకోడినియన్ సింపోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ డీఎస్పీ ఈ రికార్డింగ్ చేయించగా.. మేకింగ్ వీడియో అదరగొట్టేసింది. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ వీడియో టాప్ 5లో దూసుకుపోతుంది. ఇదివరకు ఈ మూవీ నుంచి వచ్చిన పాటలకు కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ.. వాటన్నింటికి ఈ వీడియోతో చెక్ పెట్టేశాడు దేవీ. టైటిల్ సాంగ్‌ల విషయంలో ఇప్పటికే తనదైన ముద్రను వేసుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. సరిలేరు నీకెవ్వరులోనూ అదే జోరు చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించడం మరో విశేషం. కాగా ఈ పాటను ఆర్మీకి డెడికేట్ చేయబోతున్నట్లు ఇప్పటికే దేవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఈ వీడియోకు నెటిజన్లు వావ్ అంటూ స్పందిస్తున్నారు. దేవీ సర్ మీరు నిజంగా రాక్‌స్టార్.. వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ పాట డిసెంబర్ 23న సాయంత్రం గం.5.04ని.లకు విడుదల అవ్వబోతుంది.

ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు రాబోతుండగా.. మెగాసూపర్ఈవెంట్‌గా దీన్ని చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Follow Us
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే