పూరికి..శివగామి స్పెషల్ డిస్కౌంట్..!

అప్పుడు, ఇప్పడు, ఎప్పుడైనా..సిల్వర్ స్రీన్‌పై ఆమె రేంజ్ వేరు. నటించినా, నర్తించినా, జస్ట్ అలా నడిచినా..ఆడియెన్స్ నివ్వెరపోవాల్సిందే. ఆమే వెర్సటైల్ నటి రమ్యక‌ృష్ణ. హీరోయిన్‌గా నాటి తరంలో కుర్రకారుకు కంటిన్యూగా చెమటలు పట్టించిన శివగామి..సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా సాలిడ్ నటనతో చింపి ఆరేస్తుంది. బాహుబలిలో ఆమె నటించిన శివగామి పాత్రకు మరొక నటిని ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఇలా సౌత్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది రమ్యక‌ృష్ణ. ఇప్పటికి కూడా సీనియర్ హీరోల పక్కన […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:13 pm, Mon, 23 December 19
పూరికి..శివగామి స్పెషల్ డిస్కౌంట్..!

అప్పుడు, ఇప్పడు, ఎప్పుడైనా..సిల్వర్ స్రీన్‌పై ఆమె రేంజ్ వేరు. నటించినా, నర్తించినా, జస్ట్ అలా నడిచినా..ఆడియెన్స్ నివ్వెరపోవాల్సిందే. ఆమే వెర్సటైల్ నటి రమ్యక‌ృష్ణ. హీరోయిన్‌గా నాటి తరంలో కుర్రకారుకు కంటిన్యూగా చెమటలు పట్టించిన శివగామి..సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా సాలిడ్ నటనతో చింపి ఆరేస్తుంది. బాహుబలిలో ఆమె నటించిన శివగామి పాత్రకు మరొక నటిని ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఇలా సౌత్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది రమ్యక‌ృష్ణ. ఇప్పటికి కూడా సీనియర్ హీరోల పక్కన రోల్స్ చేయాలంటే ఈ సీనియర్ హీరోయిన్‌నే ప్రిపర్ చేస్తున్నారు దర్శకులు.

కాగా బాహుబలితో శివగామి రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకింది. ప్రొడక్షన్ హౌజ్‌ను బట్టి రోజుకు రూ. 5 నుంచి 10 లక్షల మధ్యలో ఆమె పారితోషకం తీసుకుంటుందని టాక్. అంటే ఆమె 15 రోజులు డేట్స్ ఇవ్వాలంటే, కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అయితే ఆమె పూరీ టీమ్‌కు స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ప్రజంట్ పూరి అండ్ ఛార్మీ నిర్మాణ భాగస్వామ్యంలో సినిమాలు తీసున్నారు. ప్రజంట్ ఆకాశ్ పూరి నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం సెట్స్‌పై ఉంది. ఈ మూవీలో రమ్య కృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాక పూరి తదుపరి సినిమా ఫైటర్‌లోనూ రమ్య కృష్ణ లీడ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేవలం సగం రెమ్యూనరేషన్‌‌కే ఈ రెండు మూవీస్‌కి ఆమె సైన్ చేసిందట. పూరికి రమ్య క‌ృష్ణ భర్త కృష్ణ వంశీ అత్యంత సన్నిహితులు. అదీకాక పూరి తన సినిమాల్లో ప్రతి పాత్రను అత్యంత శక్తివంతంగా డిజైన్ చేస్తారు. అందుకే ఆమె డిస్కౌంట్ ఇచ్చి ఉంటారని టాక్ వినిపిస్తోంది.