AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnamma: మరీ వారం రోజులకేనా..!! ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కృష్ణమ్మ.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు మహా అయితే రెండు వారాలకు ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది.  కృష్ణమ్మ.. మంచి అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించారు.

Krishnamma: మరీ వారం రోజులకేనా..!! ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కృష్ణమ్మ.. ఎక్కడ చూడొచ్చంటే
Krishnamma
Rajeev Rayala
|

Updated on: May 17, 2024 | 11:06 AM

Share

ప్రతివారం థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తూ ఉంటాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగానే.. ఓటీటీలోనూ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు మహా అయితే రెండు వారాలకు ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది.  కృష్ణమ్మ.. మంచి అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా మొత్తాన్ని హీరో సత్యదేవ్ ఒక్కడే నడిపించాడు.. ఇక సెకండ్ ఆఫ్ సినిమాలో మంచి ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే థియేటర్స్ లో రిలీజ్ అయినా వారానికే సినిమా ఓటీటీలోకి రావడం గమనార్షం. కృష్ణమ్మ సినిమా గత శుక్రవారం (మే 10) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఆక్యుపెన్సీ కూడా పెద్దగా లేకపోవడంతో ఈ మూవీని ఓటీటీలోకి వదలాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

కృష్ణమ్మ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నేడు 17నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా .. తెలుగు సినిమాకు ఆడియోలో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది కృష్ణమ్మ. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఓటీటీలో కృష్ణమ్మ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు