Sarkaru Vaari Paata : మహేష్ మేనియా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట బ్లాస్టర్ టీజర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా..
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. అలాగే ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉండనున్నాయి. అలాగే అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందట ఈ మూవీలో. సర్కారు వారి పాట షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ గోవాలో హీరో హీరోయిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన క్షణాల్లోనే రికార్డుల వేట మొదలు పెట్టింది. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ఇప్పటి వరకు 33 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. మహేష్ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్‌గా ఈ సినిమాలో కనిపించనున్నాడని ఈ వీడియో హింట్ ఇచ్చింది. ఈ వీడియోకు 950 వేలకు పైగా లైకులు రావడం విశేషం. సర్కారు వారి పాట’ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :