శాండల్‌వుడ్ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం: సెక్స్‌ రాకెట్ !

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి.

శాండల్‌వుడ్ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం: సెక్స్‌ రాకెట్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2020 | 10:03 AM

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజనల మొబైల్‌ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్‌ఫోన్లలో సెక్స్‌ రాకెట్ కోణం‌ బయటపడినట్లు సీసీబీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వారి మొబైళ్లలో నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారుల నుంచి ఉప్పు అందింది. దీంతో డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ సెక్స్ రాకెట్ తో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్‌ ఫోన్లలో ఈ దందా కోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఉందని, డ్రగ్స్‌ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్‌ చేశారని సీసీబీ నుంచి అందుతోన్న సమాచారం.

డ్రగ్స్ కేసులో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ టీమ్ వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్‌ కిశోర్‌ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు  ఈ ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Also Read :

ఏపీ : నేడు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులు ప్రకటన !

నెల్లూరులో భారీ చోరీ, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులమంటూ